Telangana Budget Highlights: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2.. నగరంలో కొత్త కారిడార్లు

Read Time:  1 min
Telangana Budget Highlights: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2.. నగరంలో కొత్త కారిడార్లు
FONT SIZE
GET APP

Telangana Budget Highlights: 2026-27 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెట్రో రైల్ ప్రాజెక్టుపై సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) ఆధీనంలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక సాహసోపేతమైన, ప్రజానుకూలమైన నిర్ణయమన్నారు.

Read Also: TG Budget Highlights: వైద్య రంగానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

Telangana Budget Highlights: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2.. నగరంలో కొత్త కారిడార్లు
Telangana Budget Highlights: Hyderabad Metro Phase-2 New corridors in the city

Telangana Budget Highlights: మెట్రో ఫేజ్-2 విస్తరణ

హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకు సేవలందిస్తోందన్నారు. ఈ సౌకర్యాన్ని పాతబస్తీకి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్-11 కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్వర్‌ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు.  పాతబస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ అత్యవసరంగా మారిందన్నారు. ఈ మేరకు మెట్రో రైలు ఫేజ్‌ 2కూ రూ.600 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

ఇక దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించిందన్నారు. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వాములు తదితరుల సహకారంతో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.