Telangana Budget 2026: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేరుతోంది. గతంలో ఓయూను సందర్శించినప్పుడు ఆయన ఇచ్చిన హామీ మేరకు, తాజాగా ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Read Also : TG Budget and Expenditure Analysis: ప్రభుత్వం ఆదాయం మరియు ఖర్చుల పూర్తి వివరాలు
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
ఉస్మానియా యూనివర్సిటీని “తెలంగాణ గుండెకాయ”గా అభివర్ణించిన సిఎం రేవంత్ రెడ్డి, వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని విద్యార్థి లోకానికి మాట ఇచ్చారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిధులను అధికారికంగా ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణతో పాటు, ఆధునిక వసతుల కల్పనకు ఈ నిధులు వెన్నెముకగా నిలవనున్నాయి.
విద్యా రంగానికి పెద్దపీట
ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగంపై ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. మొత్తం రూ. 26,674 కోట్లను విద్యాశాఖకు కేటాయించింది. ఇందులో ఉన్నత విద్యతో పాటు పాఠశాల స్థాయి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యతనిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :