Telangana Budget 2026: ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు: భట్టి

Read Time:  1 min
Telangana Budget 2026: ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు: భట్టి
FONT SIZE
GET APP

Telangana Budget 2026: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేరుతోంది. గతంలో ఓయూను సందర్శించినప్పుడు ఆయన ఇచ్చిన హామీ మేరకు, తాజాగా ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read Also : TG Budget and Expenditure Analysis: ప్రభుత్వం ఆదాయం మరియు ఖర్చుల పూర్తి వివరాలు

Telangana Budget 2026: Rs. 1000 crore for Osmania University: Bhatti
Telangana Budget 2026: Rs. 1000 crore for Osmania University: Bhatti

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి

ఉస్మానియా యూనివర్సిటీని “తెలంగాణ గుండెకాయ”గా అభివర్ణించిన సిఎం రేవంత్ రెడ్డి, వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని విద్యార్థి లోకానికి మాట ఇచ్చారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిధులను అధికారికంగా ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణతో పాటు, ఆధునిక వసతుల కల్పనకు ఈ నిధులు వెన్నెముకగా నిలవనున్నాయి.

విద్యా రంగానికి పెద్దపీట

ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగంపై ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. మొత్తం రూ. 26,674 కోట్లను విద్యాశాఖకు కేటాయించింది. ఇందులో ఉన్నత విద్యతో పాటు పాఠశాల స్థాయి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యతనిచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.