Indiramma Indlu Scheme Budget 2026తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రెండు కీలక రంగాలకు ప్రాధాన్యతనిచ్చింది. పేదలకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు, నిరుపేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు నిధుల వర్షం కురిపించింది.
Read Also: TG Budget Highlights: వైద్య రంగానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు
1. సన్న బియ్యం పంపిణీ (Fine Rice Scheme):
రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- కేటాయింపు: పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ పథకం అమలుకు రూ. 7,366 కోట్లు కేటాయించారు.
- లబ్ధిదారులు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్ల తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. సుమారు 3.38 కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం అందనుంది.
- లక్ష్యం: నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా, మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

2. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Indiramma Indlu):
సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి, ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేస్తోంది.
- కేటాయింపు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 7,430 కోట్లు ప్రతిపాదించారు.
- లక్ష్యం: 2026-27 ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- సహాయం: ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందజేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: