Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2026: సామాన్యుడికి భారం తీరనున్నదా?

Read Time:  1 min
తెలంగాణ బడ్జెట్ 2026: సామాన్యుడికి భారం తెరనున్నదా?
తెలంగాణ బడ్జెట్ 2026: సామాన్యుడికి భారం తెరనున్నదా?
FONT SIZE
GET APP

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు శుక్రవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Telangana Budget 2026) పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండవ పూర్తిస్థాయి బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. గత ఏడాది సుమారు రూ. 3 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ ఉండగా.. ఈసారి ఆ అంకె మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన ‘విజన్-2047’ లక్ష్యానికి ఈ బడ్జెట్ పునాదిగా నిలవనుంది.

Bhatti Vikramarka: ఖమ్మంలో రహదారులకు మహర్దశ!

Telangana Budget: Telangana Budget 2026: Will the burden on the common man be lifted?
Telangana Budget: Telangana Budget 2026: Will the burden on the common man be lifted?

యువతుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ

కళ్యాణ లక్ష్మి , కొత్త పథకాలు ఈ బడ్జెట్‌లో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం కళ్యాణ లక్ష్మి పథకం. పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం రూ. 1 లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అయితే, మార్కెట్లో బంగారం ధరలు నిలకడగా లేకపోవడం వల్ల, బంగారం బదులు దానికి సమానమైన అదనపు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అలాగే యువతుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి కొత్త పథకాలకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. Also Read తెలంగాణ బడ్జెట్..ఈ రంగాలకే అధిక కేటాయింపులు.. రైతుల కోసం ఎంతంటే.. విద్య , సాగునీటి రంగానికి పెద్దపీట సామాజిక పెట్టుబడిగా భావించే విద్యా రంగానికి ఈసారి బడ్జెట్‌ లో అధిక ప్రాధాన్యత లభించనుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించనుంది. మరోవైపు, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, తుమ్మిడిహట్టి వంటి కీలక ఎత్తిపోతల పథకాలకు, భూసేకరణ కోసం సుమారు రూ. 5,000 కోట్లు అవసరమని అంచనా. వీటికి తగిన కేటాయింపులు జరిగితేనే ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. కేంద్రం నుంచి ఆశిస్తున్న ఊరట రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఆశలు పెట్టుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.