తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్నటి నుంచి (మార్చి 16) ప్రారంభం అయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడింది. నేటి నుంచి రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, అలాగే చర్చలు నడువనున్నాయి. ఇక ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. ఈ సభలో తెలంగాణ (Telangana) రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మార్చి 20న శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో.. అసెంబ్లీ సమావేశాలను మార్చి 16 నుంచి మార్చి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మధ్యలో మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా శాసనసభకు సెలవు ప్రకటించనున్నారు. అనంతరం మార్చి 20న Budget సమావేశం కొనసాగుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Read Also: Bengaluru cafe incident: యుద్ధం ఎఫెక్ట్.. నిమ్మరసానికి గ్యాస్ బిల్ ఏంట్రా బాబూ?
సంక్షేమ పథకాలు, వ్యవసాయం కేటాయింపులపై ప్రత్యేక దృష్టి
ఈ బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలకు సంబంధించిన కేటాయింపులపై ప్రత్యేక దృష్టి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై మార్చి 23 నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులు, పథకాలు, వ్యయాలపై సభ్యులు విస్తృతంగా చర్చించనున్నారు. ఈ చర్చలు కొనసాగిన అనంతరం.. మార్చి 30న బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం లభించే అవకాశం ఉంది. బడ్జెట్ ఆమోదం పూర్తయ్యాక, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈసారి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమతుల్యమైన బడ్జెట్ ప్రకటించనుంది. యువతకు సంబంధించిన ఉద్యోగ పథకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. స్టార్టప్‌లు, ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాలను ప్రోత్సహించడానికి సబ్సిడీలు, పెట్టుబడులు ప్రవేశపెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మహిళలకు, విద్యార్థులకు, వృద్ధుల సంక్షేమ పథకాల కేటాయింపులు పెరుగుతాయని, ఆరోగ్య, విద్య రంగాలకు అదనపు నిధులు కేటాయించబడతాయని అంచనా. విద్యుత్, పవర్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉచిత విద్యుత్ పథకాల కోసం, అలాగే పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: