తెలంగాణలోని మహా దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత, దర్శనాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. విశేషోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న ఎదుర్కోలు, 25న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read also: Tirupati: కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం
Brahmotsavams begin in Yadagirigutta with grandeur
ప్రత్యేక బస్సులు
ప్రధానాలయ ముఖ మంటపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తుండగా, సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారులతో పాటు పట్టణంలో స్వాగత తోరణాలు, ఆర్చిల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధానాలయాల నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: