📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెజారిటీ స్థానాలు గెలుస్తామని పార్టీ నేతల ధీమా

హైదరాబాద్: తెలంగాణ (Telangana) మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ (BJP) గంపెడాశలు పెట్టుకుంది. రానున్న 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ బీజేపీ విసృత ప్రచారం నిర్వహించింది. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పలు కీలక మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల సాధించిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో మున్సిపల్ ఎన్నికల్లోనూ అవే ప్రాంతాల్లో అత్యధిక వార్డులు, మున్సిపాలిటీలను గెలుస్తామని కమలనాథులు చెబుతున్నారు.

Read Also: TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎంతంటే?

BJP flag in Nizamabad and Karimnagar!

తెలంగాణపై బీజేపీ భారీ ఆశలు

అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పాటు మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వార్డులను గెలుస్తామన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. ఈ లెక్కన ఉత్తర తెలంగాణ (Telangana) మున్సిపాలిటీలు, కార్పోరేషన్లపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. వార్డులు, డివిజన్లు కలిపి 2,996 వరకు ఉండగా అందులో 2, 634 స్థానాల్లో బీజేపీ పోటీలో ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది.

అయితే 13న వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రెండంకెల మున్సిపాలిటీలు, నాలుగంకెల వార్డులు తమ పార్టఈ ఖాతాలో చేరుతాయని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే బుధవారం పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లలో కేవలం నిజామాబాద్, కరీంనగర్ కార్పోరేషన్లలోనే బీజేపీ జెండా ఎగురుతుందని తేల్చాయి. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెం కార్పోరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ప్రకటించాయి. ఇక 116 మున్సిపాలిటీల్లో బీజేపీకి 3 నుండి 5 మాత్రమే దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వాస్తవ ఫలితాలు బీజేపీకి ఏ మేరకు సానుకూలంగా ఉంటాయోనన్నది శుక్రవారంతో తేలనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BJP BJP Telangana hyderabad Latest News in Telugu Telangana Telangana Municipal Elections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.