📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: కాంగ్రెస్ తో కలసి అధికారానికి బిజెపి యత్నం

Author Icon By Saritha
Updated: February 14, 2026 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసక్తికరంగా మారిన ఆమనగల్లు రాజకీయం

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు (Telangana) మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం చేపట్టేందుకు బిఆర్ఎస్ (BRS) పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకున్న, బిజెపి కూడా చైర్మన్ పదవి కోసం పావులు కదుపుతుండడం చర్చనీయాంశమైంది. 15 వార్డులలో బిఆర్ఎస్ 8, బిజెపి 6, కాంగ్రెస్ 1 స్థానాలలో గెలుపొందాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ ఎనిమిది చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చేజారకుండా వెంటనే వారిని రహస్య ప్రాంతాలకు తరలించారు. అయితే అధికార పీఠంపై కన్నేసిన బిజెపి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీ అధినేత తల్లోజు ఆచారి అందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: Congress BJP Alliance : మెదక్ జిల్లాలో అనైతిక పొత్తు?

BJP attempts to come to power in alliance with Congress

చక్కర్లు కొడుతున్న ఎక్స్ అఫీషియ ఓటు రాజకీయం

ప్రస్తుతం (Telangana) బిజెపి ఆధ్వర్యంలో ఉన్న ఆరుగురు సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, ఎక్స్ అఫీషియ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆచారి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పట్టణంలో చర్చించుకుంటున్నారు. ఎక్స్ అఫీషియ ఓట్ల కొరకు కాంగ్రెస్ పార్టీ కి చెందిన స్థానిక శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, మండలి సభ్యుడుతో చర్చలు జరిపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో పక్క బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మద్దతు కూడా రాబట్టేందుకు బిజెపి యత్నిస్తున్నట్లు కూడా చర్చించుకుంటున్నారు.

అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం క్షణక్షణం భయం భయంతో ముందుకు సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క సభ్యుడు చేజారిన వారికి అధికారం దూరమయ్యే పరిస్థితి ఉండడంతో ఎక్స్ అఫీషియ ఓటు కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆమనగల్లు ప్రజల తీర్పు రాజకీయంలో హైరానా తీసుకువచ్చిందని అందరి నోట వినిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయ ప్రకంపనలతో ఈనెల 16 వరకు ఉత్కంఠ కొనసాగేలా కనిపిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aamanagallu BJP brs congress Election Results Latest News in Telugu Rangareddy District Telangana Municipal Elections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.