📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం

Author Icon By Digital
Updated: May 5, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భూ భారతి – రైతులకు రక్షణ కవచం

తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికేలా భూ భారతి చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించినట్టు తెలిపారు. అదే విధంగా మే 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి మొత్తం 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజాకోణంలో తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో ప్రతికలెక్టర్ హాజరై రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యే భాషలో వివరాలు అందించాలని సూచించారు. భూమిపై ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ రైతులకు భయానక అనుభవాలను మిగిల్చిందని, అనేక కుటుంబాలు భూ సమస్యలతో బాధపడినట్టు తెలిపారు. గత పదేళ్లలో భూ హక్కుల విధ్వంసం జరిగిందని, దీన్ని సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో భూ భారతి చట్టం తీసుకువచ్చామని పేర్కొన్నారు.

Telangana : భూ భారతి – రైతులకు రక్షణ కవచం

Telangana : రైతుల భూములకు న్యాయం చేసే మార్గం

ఈ చట్టం అమలు చేయడం వల్ల ప్రజలకు న్యాయం జరిగే అవకాశముందని, అధికార యంత్రాంగం ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యలపై ప్రజలు కోర్టుకే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే వారి వద్దకు వస్తోంది. భూ భారతి అమలు కాబోయే మండలాల్లో ఆదిలాబాద్‌ నుంచి యాదాద్రి వరకు 28 మండలాలను ఎంపిక చేశారు. వీటిలో భరోజ్, సుజాతనగరం, నడికుడి, బుగ్గారం, ఘన్పూర్, రేగొండ, ఇటిక్యాల్, సైదాపూర్, పెంచికల్ పేట్, దంతాలపల్లి, మూసాపేట్, భీమారం, చిల్పిచిడ్, కీసర, పెంట్లవల్లి, నక్రేకల్, కుంతాల, మెండోరా, ఎలిగేడ్, రుద్రంగి, కుందుర్గ్, కొండాపూర్, అక్కన్నపేట, గరిడేపల్లె, ధరూం, గోపాలపేట, వర్ధన్నపేట, ఆత్మకూర్ ఉన్నాయి.ఈ సదస్సులు ద్వారా భూ సమస్యలు వాస్తవికంగా లెక్కించబడి పరిష్కార దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. భూ భారతి ద్వారా రైతులకు భద్రతతో పాటు భూ హక్కులను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది.

Read More : Harish Rao : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హరీష్ రావు ఫైర్

Bhoo Bharathi Act Breaking News in Telugu Dharani Portal Issues Farmers Land Rights Google news Google News in Telugu Land Disputes Resolution Land Ownership Rights Latest News in Telugu Paper Telugu News Revanth Reddy Telangana Revenue Summits 2025 Rural Land Management Telugu News Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.