📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana : బీసీ రిజర్వేషన్–ఎస్సీ వర్గీకరణలో ముందస్తు

Author Icon By Digital
Updated: April 16, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana– బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు మార్గదర్శక రాష్ట్రం

హైదరాబాద్ : Telangana వెనుకబడిన తరగతుల వర్గాల కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా Telangana నిలిచిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శంషాబాద్‌లో విలేఖరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో చారిత్రాత్మకమైన కుల గణన సర్వేను లక్ష మందికి పైగా ఉద్యోగుల సాయంతో నిర్వహించడం దేశంలో మోడల్‌గా నిలిచిందని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ప్రశంసించారని తెలిపారు.కుల గణన అనంతరం జరిగిన ప్రక్రియలో సబ్ కమిటీ, బీసీ డెడికేటెడ్ కమిషన్‌ల చొరవతో అన్ని మార్గాలను క్రమబద్ధంగా అనుసరించినట్టు మంత్రి వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ‘యాక్ట్ 2, 3’ చట్టాల రూపంలో శాసనసభలో ఆమోదించి, గవర్నర్‌కి పంపించినట్టు చెప్పారు. ఏప్రిల్ 8న ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయని తెలిపారు.

Telangana: బీసీ రిజర్వేషన్ – దేశానికి మార్గదర్శక మోడల్

ఈ బిల్లులకు సుప్రీంకోర్టు కూడా రెండు నెలల్లో తేల్చాలని సూచించిన నేపథ్యంలో, రాష్ట్రపతి నుండి సానుకూల స్పందన వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం వల్ల న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. కుల గణన ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, సమాచార సేకరణలో ప్రభుత్వ శాఖలు సజావుగా పనిచేశాయని వివరించారు.

Telangana : బీసీ రిజర్వేషన్–ఎస్సీ వర్గీకరణలో ముందస్తు

బీసీ రిజర్వేషన్‌కు రాజకీయ పార్టీల ఏకగ్రీవ మద్దతు

Telangana రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులను చేర్చుకొని చారిత్రాత్మకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. 1931 తర్వాత దేశంలో మొదటిసారిగా ఇటువంటి కుల గణన జరుగడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు కుల గణనపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు తమ తమ స్థాయిలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.దేశవ్యాప్తంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రాధాన్యతతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతును మరింత పెంచే అంశమవుతుందని మంత్రి తెలిపారు.

Read more :

Donald Trump: ట్రంప్‌-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు!

Caste Based Reservation Paper Telugu News Reservation Policy India SC Reservation SC Welfare Schemes Scheduled Caste Quota Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.