Telangana : రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా రాష్ట్ర బిసి కమిషన్ గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేయనున్న సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. రాష్ట్ర బిసి కమిషన్ సమావేశం బుధవారం ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయ దేవి, అధికారులు డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె. మనోహర్ రావు, ప్రత్యేక అధికారి కుమారి ఎన్. సునీత, సెక్షన్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్ పాల్గొన్నారు.
Read Also: Urban Forests : తెలంగాణ లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ లు
సర్టిఫికేట్ జారీలో చేపట్టవలసిన మార్పులు
సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపై చర్చించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న సీడ్ పథకానికి(For seed scheme) అర్హులకు కావాల్సిన డిఎన్ సర్టిఫికేట్ జారీ విధివిధానాలపై చర్చించింది. 50 కులాలను సంచార జాతులుగా గుర్తించి ఈ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ జారీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పుల గురించి కూడా ప్రభుత్వానికి సిఫారసులను ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మినహా మిగతా అన్ని శాఖల నుండి కమిషన్కు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని క్రోడికరించి ఉద్యోగరంగంలో బిసి స్థితిగతులను అంచనా వేయడానికి ఉపయోగించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: