Telangana Budget 2026-27: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు దాదాపు రెండు వారాల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించింది.
Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం
సమావేశాల తొలిరోజైన మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. ప్రభుత్వ లక్ష్యాలు, గత ఏడాది సాధించిన ప్రగతిని ఆయన తన ప్రసంగంలో వివరించనున్నారు. అనంతరం మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుపుతారు. మార్చి 20వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: