📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: కోవా బన్ వ్యవహారంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

Author Icon By Aanusha
Updated: February 15, 2026 • 8:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(Telangana) మేడారం జాతరలో చోటుచేసుకున్న ఒక ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని లక్ష్యంగా చేసుకుని కొందరు యూట్యూబర్లు వేధించారని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ Asaduddin Owaisi అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Read Also: Revanth Comments: ‘నేనే రాజు, నేనే మంత్రి’ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ వివరణ

మత విద్వేషాలు పెంచే ప్రయత్నాలు ఆపాలి

శుభ్రత లేకుండా తయారు చేస్తున్నాడని.. వాటికి సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ఆయన ఖండించారు. కుటుంబాన్ని పోషించేందుకు జాతరలో వ్యాపారం చేసుకుంటే.. అతనికి మతరంగు పులమడం అన్యాయం అని పేర్కొన్నారు.ఒక వ్యక్తి పొట్టకూటి కోసం కష్టపడుతుంటే.. ఇలా వీడియోలు తీసి.. అతడిని ఇబ్బంది పెట్టడం వల్ల అతడి కుటుంబం మాత్రమే కాదని.. లక్షలాది చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ నాణ్యత లేకుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ.. సోషల్ మీడియాలో వీడియోలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకని నిలదీశారు.

Telangana: Asaduddin Owaisi’s anger over the Kova Ban issue

నిజంగా ఆ వ్యక్తి అపరిశుభ్రంగా కోవా బన్ తయారు చేస్తే.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలి కానీ.. కానీ లైక్‌లు, వ్యూస్ కోసం ఇలా సోషల్ మీడియాలో మత విద్వేషాలను వ్యాప్తి చేయడం సమాజానికి మంచిది కాదని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుదారి పట్టించే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులే లక్ష్యంగా మత విద్వేషాలు పెంచే ప్రయత్నాలను ఆపాలని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AIMIM Asaduddin Owaisi latest news Medaram Jatara Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.