Telangana Budget 2026 Highlights: ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వాన్ని ఒక బాధ్యతాయుతమైన పాలనగా అభివర్ణించారు. “మేము ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలు చేయం, చేసిన ప్రతి పనిని బాధ్యతగా నిర్వహిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.రైతు సంక్షేమం.. మహిళా సాధికారత.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించారు. రూ 3,24,234 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. శాఖల వారీగా కేటాయింపులను ప్రకటించారు.
Read Also: Telangana Budget 2026-27: ముగిసిన బడ్జెట్ ప్రసంగం.. ఉభయసభలు వాయిదా

బడ్జెట్ స్వరూపం
- మొత్తం బడ్జెట్.. రూ.3,24,234 కోట్లు
- రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు
- మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు
- బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
- పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన
- ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం
విద్యా శాఖకు రూ.26,674 కోట్లు - వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
- కార్మిక శాఖకు రూ.998 కోట్లు
- మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
- పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
- ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు
- ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
- బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
- మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు
- రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన
*1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరిమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు - జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు
- బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం
- ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు ఇదే అత్యధిక కేటాయింపు
- 6 గ్యారంటీలకు కేటాయింపు..
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
- పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
- బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు
- కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు
విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు
స్కాలర్షిప్లకు రూ.4,343 కోట్లు - తప్పనిసరి కార్యాలయ ఖర్చులు రూ.2,323 కోట్లు
- రైతు భరోసాకు రూ.18,000 కోట్లు
- చేయూతకు రూ.14,861 కోట్లు
- ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు
- మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు
- సన్న వడ్ల బోనస్కు రూ.3,500 కోట్లు
- గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
- రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.1,143 కోట్లు
- మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ రూ.723 కోట్లు
- మెట్రో రైలు ఫేజ్-2.. రూ.600 కోట్లు
- ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు
- యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్.. రూ.1500 కోట్లు
ITIలలో ATC ట్రైనీలకు ప్రతినెలా రూ.2వేల స్కాలర్షిప్: భట్టి - వైద్య విధాన పరిషత్ను పూర్తి స్థాయి ప్రభుత్వ సెంకడరీ హెల్త్ కేర్ విభాగంగా మార్పు
- ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ
- విదేశాల్లో యువతకు ఉపాధి కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ కార్యక్రమం
- 274 నూతన మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. - ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ విద్యార్థుల దాకా బ్రేక్ ఫాస్ట్ పథకం
- 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
- దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
- వెల్ఫేర్ స్కూల్స్లో వసతుల కల్పనకు రూ.100కోట్లు
- 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లో అప్గ్రేడ్
- 2026-27 సంవత్సరానికి పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు
- విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
- ITIలలో ATC ట్రైనీలకు ప్రతినెలా రూ.2వేల స్కాలర్షిప్
- విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్
కార్యక్రమం - ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: