హైదరాబాద్,: రాష్ట్రాన్ని అకాల వర్షాలు వదలిపెట్టడం లేదు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో అస్తవ్యస్థం అయ్యాయి. వర్షాల కారణంగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు, ధాన్యం కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గాయాలబారిన పడ్డారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి, సోమవారం కురిసిన అకాలవర్షం అన్నదాతను నిండా ముంచింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల తదితర జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలింది. నిమ్మ, బత్తాయి, మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ఉంచిన ధాన్యం తడిసింది. కొన్నిచోట్ల తమ కండ్లముందే ధాన్యం కొట్టుకు పోయింది. ఈదులుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.సిద్దిపేట, రామాయంపేట మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి వర్షపు నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు లింగంపేట, బీబీపేట్, తాడ్వాయి, గాంధారి, ధర్పల్లి, సిరికొండ భారీ వర్షం కురిసింది. తుజాల్పూర్, యాచారం, బీబీపేట, మాందాపూర్, జనగామ, భవానీపేట, ధర్పల్లి మండలంలో మామిడికాయలు నేలరాలాయి. జిల్లా అకాల వర్షాలతో అస్తవ్యస్తం. కేంద్రంతోపాటు లింగంపేట మండలం భవానీపేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.

Telangana : తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు నాశనం
తాడ్వాయి మండలం కృష్ణాజీవాడిలో మక్కజొన్న కొట్టుకుపోయింది. మాందాపూర్లో విద్యుత్తు స్థంబాలు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. మెదక్ జిల్లాలో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం చేసిన కష్టం ఒక్క వానతో నీటిపాలయ్యింది.సిద్దిపేట, రామాయంపేట మార్కెట్ యార్డుల్లో ధాన్యం వర్షం పాలైంది. వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. చిన్నగుండవెళ్లి ఎంఎన్ఆర్ పౌళి రేకులు కొట్టుకుపోయాయి. చేగుంటలో ప్రధాన రహదారిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. కొండపాక, కుకునూర్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొండపాక టోల్రజావద్ద పైకప్పు కూలడంలో ట్రాఫికు అంతరాయం కలిగింది.చిన్నకోడూరు మండలం కిష్టాపూర్లో పిడుగు వడి చక్రాల బాలరాజ్‌కు చెందిన 2 ఆవులు మృతి చెందాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం కురిసిన వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అశ్వాపురం, మధిర, దమ్మపేట మండలాల్లో నష్టం అధికంగా ఉన్నది. పలుగ్రామాల్లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అశ్వాపురం మార్కెట్యార్డులోని ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయింది.
తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు నాశనం రవాణా అంతరాయం పిడుగుపాటుతో మృతి
ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంలో తల్లపురెడ్డి రాధమ్మ (58) పశువులను మేపేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్లో పిడుగుపాటుకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కలకుంట్ల రాజు, గోప వివేక్, గోవి రంజిత్, గోపి హేమలత, గోప కవిత కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కుప్పనూర్చేందుకు వెళ్లగా భారీ వర్షంతో అక్కడే ఉన్న చెట్టుకింద నిలబడగా ఈ ఘటన చోటుచేసుకున్నది.ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కౌటాల మండల కేంద్రంతోపాటు గుడ్డ బోరి, విజయనగరం, సైదాపూర్, మొగర్ నగర్ గ్రామాల్లో చెట్లు విరిగి కరెంటు స్థంభాలు పడ్డాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, గాంధారి మండలాల్లో అకాల వర్షం కురిసింది. పాతరాజంపేట, బెకిత్యాల్ జిల్లా కేంద్రంలోని సదాశివనగర్ మండలంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Read More : PM Modi: ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి కీలక భేటీ