📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana agriculture news: పంట పొలాల్లో కిష్కిందకాండ!

Author Icon By Tejaswini Y
Updated: March 20, 2026 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana agriculture news: కోతులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లుగా కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధి మొదలు మంత్రుల వరకు సమస్యను విన్నవించినా ఫలితం ఉండడం. లేదు. ఒకప్పుడు రాష్ట్రంలో రైతులు అన్నిరకాల పంటలు పండించేవారు. నేడు కోతులు తినలేని వరి, పత్తి, మిర్చి లాంటి పంటలను మాత్రమే సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో నూనె గింజలు, పప్పు దినుసులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రైతులు కోతుల కారణంగా నేడు అలాంటి పంటలు వేసి నష్టపోలేమని తేల్చి చెబుతున్నారంటే పంట పొలాల్లో కోతులు సృష్టించే విధ్వంసకాండ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కోతుల బెడద కారణం గా రాష్ట్రంలో నూనె, పప్పు దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Read Also : Anakapalli crime: మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులోకి నిందితుడు

ఊరూ రా విపరీతంగా సాగు చేసే మొక్కజొన్న సాగు విస్తీర్ణం కూడా పూర్తిగా పడిపోయింది. నూనెలు, పప్పు దినుసుల దిగుబడి 50 శాతం మేరకు తగ్గిపోయింది. నాడు కాయధాన్యాల పంటలు పండించటంలో తెలంగాణ అగ్రభాగాన ఉండేది. కానీ నేడు 11వస్థానానికి పడిపోయింది. కోతులబెడద కారణంగా రాష్ట్రవ్యా
ప్తంగా వరి పండించడానికి మాత్రమే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పంట పొలాలపై వానరమూకలు దాడి చేసి పువ్వులు కాయలు తింటూ రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో కూరగాయలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. కోతులతో కోట్ల రూపాయల పంట నష్టం జరుగుతోంది. ప్రతి ఏటా రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పత్తి, వరి, కూరగాయల పంటలపై కోతు లు మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో పంటలు పాడైపోతున్నాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. వానరాలు పత్తి పంట కాపు సమయంలో కోతుల కాయలు తింటూ తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. కాపు కొచ్చిన మిర్చి పంటలు పాడుచేస్తున్నాయి. కూరగాయ, పండ్ల తోటలు రైతులచేతి కందకుండాచేస్తున్నాయి. కోతుల దెబ్బకు ప్రస్తుతం ప్రతిపల్లె లో పట్టణాల నుంచిసరాఫరాయ్యే కూరగాయలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కోతుల ఉత్పత్తి ఏటా గణనీయంగా పెరుగుతున్నది. గత ఆరేడేండ్ల కిందట వేలసంఖ్యలో ఉన్న కోతులు,నేడు లక్షలసంఖ్యకు పెరిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతుల బెడద వల్ల గ్రామీణ ప్రాంతంలో కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడుతున్నది.

Telangana agriculture news: Kishkindakanda in the crop fields!

టమాట, సొర, బీర, వంకాయ, బెండకాయ, చిక్కుడు తదితర కూరగాయల వంటలు వేసినా కోతులు మూకుమ్మడి దాడులు చేస్తున్నాయి. ఫలితంగా రైతులు కూరగాయలు కూడా పండించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఒకవేళ పంటలు వేసినా రోజంతా తోట వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి. తెలంగాణలో పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చే రైతులు.. కోతుల కారణంగా నేడు వెనకంజ వేస్తున్నారు. మామిడి, జామ, బత్తాయి, నేరేడు, దానిమ్మ, బొప్పాయి, సీతాఫల్ తదితర తోటలను సాగుచేస్తూ మంచి దిగుబడిని సాధించే రైతులకు కోతుల బెడద వల్ల నేడు ఆర్ధికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఆధునిక వ్యవసాయరంగంలో (హార్టికల్చర్) భాగంగా పండ్లు, పూలతోటల వల్ల అధిక దిగుబడులను సాధించేందుకు రైతులు ముందుకు వచ్చి, పలురకాల పండ్ల తోటలు వేశారు. కరీర్లో పండే ఆపిల్, విదేశాల్లో
పండే డ్రాగన్ ఫ్రూట్స్ వంటి పంటలను కూడా తెలంగాణలో పండించేందుకు రైతులు ముందుకు వచ్చారు. వీరికి సైతం కోతుల బెడద తప్పలేదు. దీంతో వారుకూడా ఆ పంటలకు ఫుల్స్టాప్ పెట్టారు.

పండ్ల తోటలకు ప్రాధాన్యం ఇవ్వాలని హార్టికల్చర్ అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నా రైతులు ససేమిరా అంటున్నారు. కోతుల బెడదను తట్టుకొని తాము పండ్ల తోటలు పెంచలేమని కరాఖండిగా చెప్తున్నారు.
రాష్ట్రంలో సుమారుగా 3 కోట్ల కోతులు ఉన్నాయని అంచనా. అదే సమయంలో గ్రామాలు మొదలుకుని పట్టణాల వరకు పిల్లలు, మహిళలు కోతుల కారణంగా బయటకు వెళ్లటానికి భయపడుతున్నారు. కోతులు గుంపులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడి మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. కోతి కరవడంతో ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ చికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతోంది.

కోతుల దాడుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో కొందరు సర్పంచులు కోతులను పట్టి అడవుల్లో విడిచి పెడదామంటే వన్య ప్రాణ సంరక్షణ సమితి వారు కోర్టుకెళ్లడంతో వాటిని నిర్బంధించడం ఆపేస్తున్నారు. వన్యప్రాణులను బంధించడం, హింసించడం నేరమంటూ కోర్టుకెక్కడంతో ఎవరూ ఏమీ చేయలేక పోతున్నారు.

అయితే… అడవులు తరిగిపోవడం, ఆహార కొరత కారణంగానే కోతులు వంట పొలాలపై దాడులు చేస్తున్నాయన్నది సుస్పష్టం. గతంలో పుష్కలంగా కనిపించిన అడవులు నేడు కానరావడం జనాభా రోజురోజుకు పెరుగుతుండటం, దానికనుగుణంగా సేద్యం అధికం కావడం వల్ల క్రమంగా అడవులు హరించుకుపోతున్నాయి. ఉన్న అడవుల్లో సైతం కోతుల సంఖ్యకు సరిపోను ఆహారం, నీరు లభించడం లేదు. ఈ కారణంగానే కోతులు ఊళ్లపై దాడులు చేస్తున్నాయని వన్యప్రాణి సంరక్షకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యవసాయరంగం పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

agriculture crisis Telangana crop damage by monkeys crop loss farmers farmers losses India monkey attacks on crops monkey menace Telangana Telangana Agriculture News Telangana Farmers Problems

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.