📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Agriculture: సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు

Telangana Agriculture: రైతులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Nageswara Rao) శుభవార్త చెప్పారు. వ్యవసాయ యాంత్రీకీకరణ పథకంలో భాగంగా సబ్సీడీపై వ్యవసాయ డ్రోన్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రికరణను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఎఎం) పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తోందని తెలిపా రు. ఇప్పటికే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రాధాన్యంతో యంత్రాలను అందజేస్తున్న ప్రభుత్వం, రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ డ్రోన్లను కూడా సబ్సిడీపై అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Read Also: TS Budget 2026-27: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

Telangana Agriculture: Distribution of agricultural drones on subsidy

తొలి విడతలో జిల్లాకు 10 చొప్పున పంపిణీ

ఈ నిర్ణయం మేరకు తొలి విడతలో ప్రతి జిల్లాకు 10 చొప్పున వ్యవసాయ డ్రోన్లను 40శాతం సబ్సిడితో గరిష్టంగా రూ.4లక్షల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు (ఎప్పివొ), ప్రాథమిక సహకార సంఘాలకు అందజేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ల వినియోగంతో పిచికారి సమయం 70-80శాతం వరకు తగ్గడంతోపాటు ఎరువులు, సూక్ష్మ పోషకాలు సమానంగా పంటపై పిచికారి చేయడం సాధ్యమవుతుందన్నారు. కూలీల ఖర్చు తగ్గి రైతులకు లాభం పెరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తెలిపారు.

ఉద్యానవన పంటల పరికరాలకు కూడా సబ్సిడీ

డ్రోన్లను సబ్సిడిపై అందజేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లను అందుబాటులోకి తీసుకు వచ్చి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం ఒకవైపు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూనే, ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం పసుపు ఉడక పెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల, ఇతర ఉద్యానవన పంటల కోత పరికరాలను కూడా సబ్సిడీ పథకంలో చేర్చిందని మంత్రి తెలిపారు.

ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం, దరఖాస్తు విధానం వంటి వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాల యాలలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. 2025-26 సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 9936 వ్యవసాయ యంత్రాలను రూ.28.74 కోట్ల సబ్సిడీపై రైతులకు అందచేయడం జరి గిందని, రానున్న 1015 రోజుల్లో మిగతావన్నీ రైతులకు అందచేయడానికి ఏర్పాట్లు చేయడం పూర్తి చేశామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Agriculture Drones Agriculture Minister Tummala Nageswara Rao drone distribution for farmers SMAM scheme Subsidy Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.