తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు ఒప్పందాలను అక్కడి ప్రముఖ సంస్థలతో చేసుకున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి కీలక రంగాల్లోహైదరాబాద్లో ‘ఎకో టౌన్’ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందాలు కుదిరాయి. దీనివల్ల నగర అభివృద్ధిలో సుస్థిరత, శుభ్రత, ప్రగతికి మరింత బలం చేకూరనుంది.
జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందం
ఈ సందర్భంగా CM రేవంత్ రెడ్డి బృందం జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలైన EX Research Institute, P9 LLC, Nippon Steel Engineering, New Chemical Trading, Amita Holdings సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సంస్థలు waste management, recycling, pollution control రంగాల్లో నిపుణులుగా పేరుగాంచాయి. వీటి సహకారంతో హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయనుంది.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోను, టెక్నాలజీ మార్పిడి దిశగా ముందడుగు
ఈ ఒప్పందాల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యాలతో భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించగలుగుతాం” అని విశ్వాసం వ్యక్తపరిచారు. తెలంగాణను సుస్థిర అభివృద్ధికి ప్రతీకగా నిలబెట్టే దిశగా చేపడుతున్న ఈ చర్యలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోను, టెక్నాలజీ మార్పిడి దిశగా ముందడుగు వేయడంలోను కీలకమవుతాయని ఆయన తెలిపారు.