📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Telangana: నా రాజీనామా ఆమోదించండి: ఎమ్మెల్సీ కవిత

Author Icon By Anusha
Updated: January 5, 2026 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Telangana: Accept my resignation: MLC Kavitha

తెలంగాణ (Telangana) జాగృతిని స్థాపించి, మహిళలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. శాసన మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్‌లో తనకు సమయం ఇచ్చినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని ఆమె గుర్తుచేశారు.

Read also: Jaggareddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బిఆర్ఎస్ నేతలు

శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ”రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే తనపై కక్ష మొదలయ్యింది. 8 ఏళ్లు స్వతంత్రంగా జాగృతిని నడపాను. జాగృతి సంస్థను అడ్డుకోవాలని మొదటి నుంచే ప్రయత్నాలు జరిగాయి. నా వద్దకు పెద్దవాళ్లు, పైరవికారులు రాలేదు. ఇన్నాళ్లుగా పేదల కోసమే నేను పనిచేశాను. పార్టీ పేపర్లు, ఛానళ్లు నాకు సపోర్ట్ ఇవ్వలేదు.

రాజకీయ కక్షలతో నన్ను జైల్లో పెట్టారు. ఎప్పుడూ కూడా నాకు పార్టీ అండగా లేదు. బీఆర్‌ఎస్‌లో డిసిప్లినరీ కమిటీ అనేది పెద్ద జోక్. నా అభిప్రాయం తెలుసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. ఎలాంటి నైతికత లేని బీఆర్‌ఎస్‌ నుంచి వైదొలుగినందుకు సంతోషిస్తున్నాను. ఉద్యమకారులను, మనకు సపోర్టు ఇచ్చిన వాళ్లను పార్టీ గుర్తించలేదు. పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. రాజకీయ పార్టీలు ఒక దిక్సూచిగా ఉండాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది.

కేసీఆర్ కు మద్దతు

కేసీఆర్ పై కక్షతో నన్ను జైల్లో పెట్టారని, నేను ఒంటరిగా ఈడీ, సీబీఐలపై కొట్లాడానని కవిత స్పష్టం చేశారు. పార్టీ అండగా నిలబడకపోవడం నాకు బాధకల్గించిందని వాపోయారు. 8ఏళ్లుగా పార్టీలో నన్ను తీవ్ర ఇబ్బందుల పాలు చేశారని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చాక పీసీ. ఘోష్ కమిటీకి వ్యతిరేకంగా కేసీఆర్ కు మద్దతుగా కొట్లాడానని, కేసీఆర్ ను విమర్శిస్తే బీఆర్ఎస్ నుంచి ప్రతిఘటన లేదని, కేటీఆర్, హరీష్ రావులను అంటే మాత్రం ఆందోళన చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 8పేజీల రాజ్యాంగం ఒక జోక్ అని, నా సస్పెండ్ లో అందులోని ఏ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. 20సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పడిన కష్టాన్ని మరిచి అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. 

నాదీ ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పోరాటం కాదు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటమే. రాజకీయాల్లో మహిళలు లేరు. నా రాజీనామా తర్వాత మండలిలో ఇద్దరే మహిళలు ఉంటారు. రాజకీయాల్లో మహిళల శాతం 0.0003 శాతం మాత్రమే. మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత పెరగాలి. జనాలు కాంగ్రెస్‌ గెలిపిస్తే ఆ పార్టీ ప్రజలను నిర్లక్ష్యం చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Kalvakuntla Kavitha latest news MLC resignation Telangana Jagruti Telangana Movement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.