తెలంగాణలో(Telangana) మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక నేతలు ఉండగా, కొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు తెలిపారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా బలహీనపరిచిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read also: Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్
మధ్యాహ్నం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు
లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులను(Telangana) మీడియా ముందుకు తీసుకువచ్చి, వారు ఎందుకు ఆయుధాలు వదిలి బయటకు వచ్చారన్న అంశాలను వివరించనున్నారు.
‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టులపై ఉక్కుపాదం
మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్లలో హిడ్మా, చలపతి, బస్వరాజ్, గణేశ్ వంటి అనేక మంది అగ్ర నేతలు మృతి చెందడం మావోయిస్టు సంస్థకు భారీ నష్టంగా మారింది.
అడవులను వీడి జనజీవనంలోకి మావోయిస్టులు
అగ్ర నాయకత్వం కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది క్యాడర్ అడవులను విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి రావడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో లొంగుబాటు జరగడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: