📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

Author Icon By Aanusha
Updated: December 31, 2025 • 7:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీలు, ఈవెంట్లు, పబ్‌లు, క్లబులు, బార్లు పర్మిట్ రూముల్లో మందు తాగుతూ మందుబాబులు సందడి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో మద్యం తాగుతూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. దీంతో డిసెంబర్ 31న రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉంటారు. పట్టుబడినవారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో డ్రంకెన్ డ్రైవ్ చేయవద్దని పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు.

Read Also: Elections:తెలంగాణలో 2026 మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం

ఉచిత రైడ్ సేవలు

ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందిస్తామని తెలిపింది. HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 అర్ధరాత్రి ఒంటిగంట వరకు సేవలు ఉంటాయని పేర్కొంది. 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ సర్వీసులు పొందవచ్చని వెల్లడించింది.

Telangana: A bumper offer for liquor consumers?

కొత్త ఏడాది వేళ నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పలు గైడ్ లైన్స్ జారీ చేశారు. మద్యం తాగినవారికి రెస్టారెంట్స్, బార్, ఈవెంట్ల యజమానుల క్యాబ్ సర్వీస్ కల్పించాల్సి ఉంటుంది. డ్రైవర్‌ను కేటాయించాల్సి ఉంటుంది. ఇక మద్యం తాగి రోడ్లపై హల్ చల్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నారు. పట్టుబడినవారి వెహికల్‌ను సీజ్ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

free ride service latest news New Year Celebrations Telangana news Telugu News TGPGWU

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.