📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Telangana: సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

Author Icon By Aanusha
Updated: January 14, 2026 • 9:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి పండుగను పురస్కరించుకునితెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త అందించారు. రాష్ట్రంలోని సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ బోనస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.500 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తెలిపారు.

Read Also: SIR: ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

Telangana: A bonus of ₹500 per quintal for fine variety paddy

సాగునీటి విడుదల

మంగళవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో రూ.66.33 కోట్లతో నిర్మించిన ‘మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని’ మంత్రి ప్రారంభించారు. ఎన్నెస్పీ కాల్వ వద్ద మోటార్‌ను స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడుదల చేసిన అనంతరం.. మంచుకొండ గ్రామంలో కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..

ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని, రాబోయే మూడేళ్లలో తెలంగాణ (Telangana) ను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశం ఏటా రూ. లక్ష కోట్లు వెచ్చించి విదేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటోందని, భవిష్యత్తులో ఆ సంపద అంతా మన రాష్ట్ర రైతులకు దక్కాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా నూనెను సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Telugu News tummala nageswara rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.