📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: Telangana: హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Author Icon By Pooja
Updated: December 9, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ వాసులకు శుభవార్త అందిస్తూ, జలమండలి త్వరలోనే నగరానికి 24 గంటలు తాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాబోయే రెండేళ్లలో 20 టీఎంసీల నీరును అదనంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. జలమండలి రూపొందిస్తున్న విజన్ డాక్యుమెంట్ 2030లో పాత పైపుల మార్పు, స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, నూటికి నూరు శాతం మురుగునీటి శుద్ధి వంటి కీలక అంశాలను చేర్చారు. నగరం విస్తృతమవుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల బలోపేతం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read Also:  TG Weather: తెలంగాణలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: 24-hour drinking water supply in Hyderabad

రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి రానున్న నీటిలో 15 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీ పునరుజ్జీవనానికి వినియోగించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వచ్చే 307 MGD నీటి ఆధారంగా 24 గంటల సరఫరా వ్యవస్థను అమలు చేయాలని జలమండలి ప్రణాళిక రూపొందిస్తోంది.

27 కొత్త పట్టణాల విలీనంతో మురుగునీటి వ్యవస్థ బలోపేతం

జలమండలి పరిధి ఇప్పటికే 2,050 చ.కిమీ. వరకూ విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో కొత్తగా 27 పట్టణ స్థానిక సంస్థలు చేరిన నేపథ్యంలో మురుగునీటి వ్యవస్థను మరింత అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టెండర్ పూర్తయిన 39 ఎస్టీపీలు త్వరగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులకు 2018లో షా కమిటీ రూ.17 వేల కోట్ల వ్యయం అంచనా వేసినప్పటికీ, కొత్త నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నారు.

నీటి వృథా తగ్గింపు లక్ష్యం – పాత పైపులకు బదులు కొత్తవి

నగరంలో(Telangana) రోజువారీగా జరిగే నీటి లీకేజీలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. నీటి సరఫరాలో 30–40% వృథా అవుతున్నదని అధికారులు చెబుతూ, దాన్ని 20%కి తగ్గించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
ఈ దిశగా:

వంటి చర్యలను అమలు చేయనున్నారు.

స్మార్ట్ వాల్వ్‌లు, రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌తో నీటి పంపిణీ

24 గంటల నీటి సరఫరా లక్ష్యంతో జలమండలి(Telangana) ఆధునిక టెక్నాలజీకి దారితీస్తోంది.

త్వరలో అమల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

24x7WaterSupply Google News in Telugu HyderabadDevelopment HyderabadWaterSupply Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.