📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ వేటు?

Author Icon By Sudheer
Updated: February 5, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న తీన్మార్ మల్లన్న (నవీన్ కుమార్) పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలకు సిద్ధమైంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా బీసీ కులగణన, ఇతర సామాజిక అంశాలపై మల్లన్న చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ నేతల అసంతృప్తికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై తీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ పరువు దెబ్బతీసేలా మల్లన్న వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవడం అనివార్యమని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదులు అందించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తీన్మార్ మల్లన్న భవిష్యత్తు ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆయనపై తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన కోసం అందరూ వేచిచూస్తున్నారు.

congress suspend Google news Teenmar Mallanna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.