📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి

Author Icon By Sharanya
Updated: July 13, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఘటన మేడిపల్లిలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై (MLC kavitha) చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna) కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసమైంది. దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు, విషయం తీవ్రతను పెంచింది.

కాల్పులు జరిపిన గన్‌మెన్

ఈ క్రమంలో మల్లన్న (Teenmar Mallanna) గన్‌మెన్(Gunmen) గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. జాగృతి కార్యకర్తల దాడిలో మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్‌ ధ్వంసం అయింది. మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపిస్తున్నారు. అయితే జాగృతి నేతల దాడి సమయంలో మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు.

దాడికి కారణమైన వ్యాఖ్యలు

శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మల్లన్న కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌తో కవితకు ఏం సంబంధం..? మీకు మాకు ఏమైనా కంచం పొత్తా అంటూ మల్లన్న వ్యాఖ్యానించారు. మేం రిజర్వేషన్లు అమలు చేస్తుంటే.. మీరు పండగచేసుకోవడం ఏంటో అర్థం కావడంలేదంటూ మల్లన్న ప్రసంగించారు. ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న జాగృతి శ్రేణులు.. ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ కొనసాగుతోంది.

రాజకీయంగా పెరుగుతున్న ఉద్రిక్తత

ఈ ఘటనతో మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ దాడిలో జాగృతి కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యే అవకాశముంది. మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: CM Revanth Reddy: నేడు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర..బోనం సమర్పించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

breakig news BRS vs Teenmar Mallanna Jagruthi Activists Attack Kavitha Comments Controversy latest news Mallanna Office Violence Medipally News Teenmar Mallanna Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.