📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Teenmar Mallanna: కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : తీన్మార్ మల్లన్న

Author Icon By Sharanya
Updated: July 13, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) (చింతపండు నవీన్) చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరులు, ఆదివారం, మేడిపల్లి ప్రాంతంలోని క్యూ న్యూస్ కార్యాలయంపై (Q News Office) దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయ ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనలో మల్లన్న సహా, కార్యాలయ సిబ్బంది గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

తీన్మార్ మల్లన్న స్పందన

తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటేనని అన్నారు. బీసీల సమస్యలపై (problems of BCs) తాము ప్రభుత్వంతో పోరాడుతుంటే కవితకు ఎందుకు భాధ అని మల్లన్న ప్రశ్నించారు.

కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్ పై ఉన్న అసహనాన్ని కవిత తమపై ప్రదర్శిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు పురిగొల్పిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయినా, తాను ఇటువంటి దాడులకు భయపడేది లేదని, మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కడం ఖాయం అని హెచ్చరించారు.

అంతకుముందు, ఓ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలతో మీకు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అంటూ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జాగృతి కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి దిగినట్టు సమాచారం.

Read hindi news hindi.vaartha.com

Read also Fire Accident: పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం

BC Reservation Debate Breaking News Kavitha MLC Controversy latest news Medipally Violence Q News Office Attack Teenmar Mallanna Telangana Jagruthi Protest Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.