📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Teenmaar Mallanna : సజ్జనార్ కు తీన్మార్ మల్లన్న సవాల్

Author Icon By Sudheer
Updated: November 22, 2025 • 6:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారిన iBOMMA పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుపై సామాన్య ప్రజల నుంచి రవికి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెంచి, సామాన్యులు సినిమాలు చూడలేని పరిస్థితి తీసుకువచ్చిన సినీ వర్గాలకు వ్యతిరేకంగా రవి అందరికీ ఉచితంగా సినిమాను చూపించాడనే భావన ప్రజల్లో ఉంది. ఈ క్రమంలో, రవికి ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రవి అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్‌కి బహిరంగంగా సవాల్ విసిరారు. రవి దమ్మున్నోడు కాబట్టే అతనికి ప్రజల మద్దతు ఉందని పేర్కొన్న మల్లన్న, వంద రూపాయల టికెట్లను వేలల్లో అమ్ముకునే సినిమావాళ్లు ఏమన్నా సంసారులా? అంటూ ప్రశ్నించారు.

Telugu News: UP Crime: తాంత్రికుడి దారుణం – 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

సీపీ సజ్జనార్‌ను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న మరింత ఘాటుగా స్పందించారు. “నిన్ను చూస్తే జాలేస్తుంది, నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. పోలీసులకు సవాల్ విసిరితే ఏమవుతుందోనని సినిమా వాళ్ళను పక్కన పెట్టుకుని సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలని మల్లన్న అన్నారు. iBOMMA రవి గురించి అతని భార్య హింట్ ఇవ్వకపోతే పోలీసుల అల్సేషన్ కుక్కలు కూడా అతన్ని పట్టుకునేవి కావని ఎద్దేవా చేస్తూ, ఇప్పటికైనా సజ్జనార్ రియాలిటీలోకి రావాలని హితవు పలికారు. అంతేకాకుండా, దమ్ముంటే సైబర్ క్రైమ్‌లను ఆపి చూపించాలని సవాల్ విసిరిన మల్లన్న, సజ్జనార్‌పై పాత కేసులను ప్రస్తావించారు. “నువ్వు చేసేవన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్లే అని, వరంగల్‌లో కూడా చేసింది అదేనని” తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తూ, సినిమా టికెట్ల అధిక ధరల సమస్యను ప్రస్తావిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం సీపీ సజ్జనార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పైరసీ నిర్వాహకుడైన iBOMMA రవికి బహిరంగంగా మద్దతు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పిల్లల కిడ్నాప్‌లు, సైబర్ క్రైమ్ మోసాలు, ఆర్థిక నేరాలు వంటి తీవ్రమైన సమస్యలపై దృష్టి పెట్టాలని, దమ్ముంటే వాటిని ఆపి చూపించాలని సజ్జనార్‌కి సవాల్ విసరడం ద్వారా మల్లన్న ఈ కేసును ప్రజా సమస్యల కోణం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu Latest News in Telugu sajjanar teenmaar mallanna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.