Hyderabad Metro Updates: నగరవాసులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో శుక్రవారం అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా నాగోల్ – రాయదుర్గం (Nagole-Rayadurg) మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Read Also: Bandi Sanjay Kumar: ఆ వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకే.. సిఎం భాష బాధాకరం
ప్రయాణికుల ఇబ్బందులు
- ఎక్కడికక్కడ నిలిచిన రైళ్లు: సాంకేతిక లోపం వల్ల రైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి. దీంతో ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌లపై వేచి చూడాల్సి వస్తోంది.
- ట్రాఫిక్ రద్దీ: మెట్రో నిలిచిపోవడంతో ప్రయాణికులు రోడ్డు మార్గాల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల ఉప్పల్, ఎల్‌బీ నగర్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది.
- సమాచారం లేక గందరగోళం: మెట్రో అనౌన్స్‌మెంట్‌లు స్పష్టంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సాంకేతిక సమస్యవల్ల నాగోల్-రాయదుర్గం మార్గంలో మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మెట్రో నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. వివిధ పనుల నిమిత్తం వేగం వెళ్లవచ్చనే ఉద్దేశంతో మెట్రోను ఆశ్రయించిన ప్రయాణికులు అంతరాయంవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: