📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Teachers : ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వొద్దు – టిజి టిటిఎఫ్ విజ్ఞప్తి

Author Icon By Shravan
Updated: August 5, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులను కాదని.. వేరే వర్గాల వారికి పదోన్నతులు ఇవ్వరాదని తెలంగాణ ట్రైబల్ టీచర్స్ (Teachers) ఫెడరేషన్ (టిజి టిటిఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య శాఖ అదనపు డైరక్టర్ లింగయ్యకి సోమవారం వినతి పత్రం ఇచ్చినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజి టిటిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం బిచ్చ. రాష్ట్ర గౌరవ సలహాదారులు బి శంకర్, సోషల్ మీడియా కన్వీనర్ వీరు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి బన్సీలాల్ లు పాల్గొన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో వెంటనే పదోన్నతులు ఆపాలని లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత రాజ్యాంగం 5. 6వ షెడ్యూల్, 10వ భాగం, ఆర్టికల్ 244(1), పెసా యాక్ట్. 170 యాక్ట్రికిలోబడి షెడ్యూల్ ఏరియాలో ఉద్యోగాలు, రాజకీయ పదవులు, భూమి మీద హక్కు, టెండర్లు, చైర్మన్ పదవులన్నీ స్థానిక గిరిజనులకే దక్కుతాయని తెలిపారు. ఆర్టికల్ 14, 15, 16, ఇంద్రసోహాని కేసుతో ఏజెస్సీ ప్రాంత చట్టాలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కానీ సుప్రీమ్ కోర్టు ఏజెన్సీ చట్టాలను పరిగణనలో తీసుకోకుండా, జిఓ 3 విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణనలో తీసుకోకుండా, ఆర్టికల్ 14, 15, 16, ఇంద్రసాహాని కేసును పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా ఇచ్చిన జి. జిఒ3కి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సపోర్టింగ్ ఆర్డర్ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షి౦చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.

70 శాతం నుంచి 80 శాతం గిరిజన జనాభా ఉన్న ఏజెన్సీ జిల్లాలలో గిరిజనుల ఏజెన్సీ హక్కులను కాదని పదోన్నతులు ఎలా నిర్వహిస్తారని లక్ష్మణ్ నాయక్ ప్రశ్నించారు. పదోన్న తులు ఆపని పక్షంలో జిల్లా స్థాయిలో పదోన్నతులు జరగనివ్వమని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో అడక్వసీ అనేది ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి ఎవరి వాటా వారికి ఇవ్వగలరని తెలిపారు. జనరల్ రోస్టర్ కట్ ఆఫ్ తేదీ లోపల పదోన్నతులు పొందిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించాలన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్న ఖాళీలలో ఆడక్వసీ ప్రకారం ఎవరి వాటా వారికి ఇస్తున్నట్లుగా ప్రమోషన్ రిక్రూట్మెంట్ లో కూడా ఉన్న ఖాళీల నుండి ఎవరి వాటా వారికి ఇవ్వాలన్నారు. ఎన్సిఈఆర్టీ నార్మ్స్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్చుకు లోబడి టెట్ క్వాలిఫై అయిన ఉపాధ్యాయులకు మాత్రమే పదోన్న తులు కల్పించాలనే డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/liquor-tenders-plans-ready-for-liquor-tenders-in-august-itself/telangana/526419/

Breaking News in Telugu Latest News in Telugu teacher promotions Telugu News Paper TGT TTF demands Tribal rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.