Tax rules: హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త

Read Time:  1 min
Tax rules: హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
FONT SIZE
GET APP

Tax rules: హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను నిబంధనల నోటిఫికేషన్ ప్రకరారం, అద్దె ఇళ్లలో నివసించే జీతభత్యాలు పొందే ఉద్యోగులకు లభించే పన్ను రాయితీ (హెచ్ఐర్ఎ మినహాయింపు) 50శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఈ మినహాయింపు 40శాతం ఉండేది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) ఈ మేరకు నిబంధనలను నోటిఫై చేసింది.

Read Also : Air India, AI 185: 8 గంటల గాలిలో ప్రయాణం.. చివరకు ఢిల్లీలోనే ల్యాండింగ్

Tax rules: Good news for Hyderabad taxpayers
Tax rules: Good news for Hyderabad taxpayers

ఈ అధిక పన్ను రాయితీ కోసం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి కొత్త నగరాలు కూడా చేరాయి. కానీ ఇంటి యజమాని అద్దెదారు సంబంధాన్ని వెల్లడించడాన్ని తప్పనిసరి చేసే ఆదాయపు పన్ను చట్టం, 2025కు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు శుక్రవారం నోటిఫై చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులకు 40 శాతం మినహాయింపు అమలులో ఉంటుంది. హెచ్ఎస్ఏ పరిమితిని 50 శాతానికి పెంచడంతో హైదరాబాద్ జీతభత్యాల వర్గానికి భారీ పన్ను ఉపశమనమని చెప్పవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.