CPM expulsion news : పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలతో Tammineni Koteswara Rao ను Communist Party of India (Marxist) (సీపీఎం) ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ఖమ్మం రూరల్ మండల కమిటీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలే ఈ కఠిన చర్యలకు దారితీసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు (తెల్దారుపల్లి) నుంచి సీపీఎం అభ్యర్థిగా కోటేశ్వరరావు భార్య విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీని ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాన్ని పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన చర్యగా సీపీఎం పరిగణించింది.
Read Also: ICC T20 ranking list : ఐసీసీ ర్యాంకింగ్స్ షాక్, ఇషాన్ కిషన్ 32 స్థానాలు జంప్!
కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలతో పాటు, పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారని సీపీఎం నేతలు (CPM expulsion news) ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు Tammineni Veerabhadram సోదరుడే ఇలా వ్యవహరించడంపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మంగతాయి భర్త, దివంగత నేత తమ్మినేని కృష్ణయ్య హత్య అనంతరం రెండు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు పెద్దల సమక్షంలో జరిగిన సయోధ్యలో భాగంగానే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ జరిగిందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. కుటుంబాల మధ్య విభేదాలు తగ్గడాన్ని గ్రామస్థులు స్వాగతించినా, పార్టీ అభ్యర్థిని స్వేచ్ఛగా తప్పించడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని సీపీఎం స్పష్టం చేసింది.
ఇంతకుముందు కూడా కోటేశ్వరరావు వ్యవహార శైలిపై పార్టీ అంతర్గతంగా హెచ్చరికలు ఇచ్చినా మార్పు రాలేదని నేతలు చెబుతున్నారు. వ్యక్తిగత అంశాలను రాజకీయ నిర్ణయాలుగా మార్చడాన్ని ఉపేక్షించరాదన్న ఉద్దేశంతోనే ఈ బహిష్కరణ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం రాజకీయాల్లో, ముఖ్యంగా తమ్మినేని కుటుంబ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: