📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Suryapet District: సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు

Author Icon By Anusha
Updated: August 14, 2025 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అలుగులు పోస్తున్న చెరువులు

    నడిగూడెం, (సూర్యాపేట): రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడు తున్నాయి. చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో చెరువులు అలుగుపోస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వము మూడు రోజులపాటు అధికారులకు సెలవులను రద్దు చేసింది. జిల్లాలో సరాసరి 43.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా నాగారంమండలంలో 187.9 మిల్లీమీటర్లు తిరుమల గిరిలో 180.4 మిల్లీమీటర్లు తుంగతుర్తిలో 132.3 కిలోమీటర్లు జాజిరెడ్డిగూడెంలో 121.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగారం మండలంలో పనిగిరి, పసునూరు, పస్తాల, లక్ష్మాపురం, వర్ధమానుకోట, నాగారం, కొత్తపల్లి, ఈటూరు గ్రామాలలో ఉన్న కల్వర్టులవద్ద ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తుంది. అరవపల్లి మండలంలో పాఠశాలల ఆవరణలో వరద నీరు చేరింది. తిరుమలగిరి మండలం లో భారీ వర్షం కురిసింది.

    తుంగతుర్తి మండలంలో చెరువులు అలుగుపోశాయి

    వలిగొండ, తొర్రూరురహదారిలో తొండ గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం సాగుతున్న నేపథ్యంలో భారీగా వరద నీరు చేరింది. మద్దిరాల మండలంలో కుక్కడం గుమ్మ డవెల్లి పోలుమళ్ళ చిన్ననెమలి కుంటపల్లి గ్రామాలలోని చెరువులు నిండాయి. ఆత్మకూరు మండలం చివ్వెంలా ముకుందాపురం రహ దారిలో ఏపూరు బ్రిడ్జిపై బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు అంత రాయం కలిగింది. తుంగతుర్తి మండలం (Tungaturthi Mandal) లో చెరువులు అలుగుపోశాయి. సంగం కోడూరు రహదారిపై వరద నీరుప్రవహించడంతో ఇబ్బంది కలిగింది. తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరి నాట్లు వేయగా వరద నీరు ప్రవహించటంతో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలగిరి మండలంలో మాలిపురం, గుండెపురిలో చెరువులు అలుగు పోస్తున్నాయి.

    Suryapet District

    వరద ప్రభావిత ప్రాంతాలను

    ఎస్సారెస్పీ కెనాల్కు గండ్లు పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. సం బంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలంలో నారాయణపురం గ్రామ చెరువు అలుగు పోస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అదనపు కలెక్టర్ రాంబాబు (Collector Rambabu) పర్యటించారు. సహా యక చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేసి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని ఆదేశించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠం పల్లి, రఘునాధపాలెం రోడ్డులో “మఠంపల్లిబ్రిడ్జి వద్ద నీరు పొంగి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రఘునాథపాలెం వెళ్లే మోడల్ స్కూల్ విద్యార్థులు వాగు దాటేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన కలెక్టర్ తేజస్సు నందులాల్ పవర్ తన కారులో విద్యార్థులను ఎక్కించుకొని మోడల్ స్కూల్కు తీసుకెళ్లారు.

    వర్షం తగ్గిన తర్వాత వాహనాన్ని ఏర్పాటుచేసి

    వర్షం తగ్గకపోతే రాత్రి భోజనం ఏర్పాటు చేసి వర్షం తగ్గిన తర్వాత వాహనాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులను గృహాలకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో మేళ్లచెరువు వెళ్లే రోడ్డు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండగా ప్రజలు వెళ్లకుండా గ్రామపంచాయతీ సిబ్బంది,అక్కడే ఉండి జాగ్ర త్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తుంగ తుర్తి పరిధిలో సంగెం గ్రామంలో భారీ వర్షాలకు తెగిన రోడ్డును సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్ బుధవారంపరిశీలించారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో వర్షానికి ఇబ్బందులు పడ్డ వారికి లైన్స్ క్లబ్ తొర్రూరు వారి సహకారంతో 39 కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో 24 గంటల పాటు అందు బాటులో ఉండేలా కంట్రోల్రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఎవరికైనా సహాయం కావాలంటే 6281 492 368 నెంబరికి ఫోన్ చేసి సమాచారం అందజేస్తే వెంటనే సహాయక చర్య లు చేపడతామని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

    సూర్యాపేట జిల్లా ఎప్పుడు ఏర్పడింది?

    2016 అక్టోబర్ 11న తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేసింది.

    సూర్యాపేట జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి?

    సూర్యాపేట జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉన్నాయి.

    Read hindi news: hindi.vaartha.com

    Read also:

    https://vaartha.com/minister-tummala-nageswara-rao-projects-are-full/telangana/530249/

    Breaking News heavy rains have been lashing the district for the past two days latest news many ponds in several mandals are overflowing Nadigudem ponds are filled to the brim Suryapet Telugu News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.