AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ

Read Time:  1 min
Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi
Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ..AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని పేర్కొన్నారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. ఆధార్ కార్డులో మరో అడ్రస్ ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. 2011 తెలంగాణ సర్వే ప్రకారం.. జనాభా లెక్కల ప్రకారం.. 51లక్షల మంది మైనార్టీలు ఉన్నారని.. ఆధార్ ప్రకారం.. మన తెలంగాణ జనాభా 3.80 కోట్లు అని తెలిపారు. నేను ఒక ముస్లింకే కాదు.. అన్ని వర్గాలకు ప్రతినిధిని అని అక్బరుద్దీన్ తెలిపారు.

image

అన్ని వర్గాలు ఓటు వేస్తేనే గెలిచాను. ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత కులగణన నివేదికను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.