న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు: సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ సందర్భంగా, హైਕోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమీ భట్టాచార్య పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఎన్. పెద్దిరాజు సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జులై 29, 2025న కొట్టివేసిన సుప్రీంకోర్టు, పిటిషనర్‌తో పాటు న్యాయవాదులు రితేష్ పాటిల్, నితిన్ మిశ్రాలపై కోర్టు ధిక్కరణ కేసు చేపట్టింది. న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు చేయడం సహించరాని నేరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.
జస్టిస్ మౌసుమీ భట్టాచార్యకు బేషరతు క్షమాపణ
ఆగస్టు 11, 2025న జరిగిన విచారణలో, పిటిషనర్ తరఫు న్యాయవాదులు అఫిడవిట్ ద్వారా క్షమాపణలు చెప్పినట్టు తెలిపారు. అయితే, సీజేఐ గవాయ్, “సుప్రీంకోర్టుకు క్షమాపణ సరిపోదు, జస్టిస్ మౌసుమీ భట్టాచార్యకు నేరుగా బేషరతు క్షమాపణ చెప్పాలి,” అని ఆదేశించారు. వారంలోగా తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించి, క్షమాపణలను జస్టిస్ భట్టాచార్య ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సూచించారు.
న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడే బాధ్యత: సీజేఐ
సీజేఐ జస్టిస్ గవాయ్, “ఈ మధ్యకాలంలో కొందరు న్యాయవాదులు ట్రయల్, హైకోర్టు న్యాయమూర్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా రాజకీయ నాయకుల కేసుల్లో ఈ ధోరణి ఎక్కువైంది. ఇది అస్సలు సహించబోం. హైకోర్టు న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది,” అని హెచ్చరించారు. ఈ ఆదేశాలు న్యాయవాదులు, పిటిషనర్లకు గట్టి సందేశం పంపాయి.
కేసు నేపథ్యం: రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు
2016లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ సందర్భంగా, జస్టిస్ మౌసుమీ భట్టాచార్య కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే వాదనలు విన్నారని, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషనర్ ఎన్. పెద్దిరాజు ఆరోపించారు. ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు నిరాధారంగా తోసిపుచ్చింది.
తదుపరి విచారణ: నాలుగు వారాలకు వాయిదా
సుప్రీంకోర్టు, జస్టిస్ మౌసుమీ భట్టాచార్య క్షమాపణలను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆమెకే వదిలింది. హైకోర్టులో ప్రక్రియ పూర్తయిన తర్వాత, నాలుగు వారాల్లో ఈ కేసును మళ్లీ విచారిస్తామని తెలిపింది. ఈ ఆదేశాలు న్యాయవ్యవస్థలో గౌరవం, బాధ్యతాయుత ప్రవర్తనను ఉద్ఘాటిస్తున్నాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :