📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Supreme Court: డిస్కమ్ లకు రూ.1.75 లక్షల కోట్లు చెల్లించండి

Author Icon By Anusha
Updated: August 9, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాలుగేళ్లలో బకాయిలు పూర్తి చేయాలని సుప్రీం తీర్పు

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్ల)కు పెండింగ్ బకాయిలను చెల్లించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా నిమిత్తం పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.1.75 లక్షల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, వాటిని నాలుగేళ్లలోగా చెల్లించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. అదే 2024 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత పెండింగ్ పడిన బాకీలను,మూడేళ్లలోపు కట్టాలని తేల్చిచెప్పింది. విద్యుత్ సరఫరాకు అయ్యే వ్యయంపై వార్షిక ఆదాయ అవసరాలు దాఖలు చేస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి వ్యయాన్ని వినియోగదారుల నుంచి రాబట్టుకోవడానికి విద్యుత్ నియంత్రణ మండళ్లు అనుమతి ఇవ్వట్లేదని పిటీషన్లు సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఇందువల్ల బకాయిల వసూళ్లు నిమిత్తం విద్యుత్ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని,ప్రభుత్వాలు బకాయిలు విడుదల చేయడం లేదంటూ దాఖలైన కేసును విచారించి సుప్రీం ఈమేరకు తీర్పు వెలువరించింది.

Supreme Court: 

సమాన వాయిదాల్లో

దీంతో తెలంగాణ సర్కార్రాష్ట్ర డిస్కంలైన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపినీ సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (Telangana Electricity Distribution Corporation) రెండింటికీ రూ.14,928 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్కు ఇచ్చిన హామీలో భాగంగా ట్రూఆప్ చార్జీలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 2016-17 నుంచి 2022-23 ఆర్ధిక సంవత్సరం వరకూ అంచనా వేసిన విద్యుత్ వినియోగం వ్యయం కన్నా రూ.12,550 కోట్ల వాస్తవ వ్యయం ఎక్కువగా ఉందని నియంత్రణ కమిషన్ భావించింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయాలని దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించగా, గత ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఐదు సమాన వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని విద్యుత్ నియంత్రణ కమిషన్కు పూచీ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ఆ బకాయిలతో పాటు, ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో మరో రూ.2,378 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలు రూ.14,928 కోట్లను తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా వాటిని చెల్లించకుండా పెండింగ్లో ఉంచింది. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించింది.

సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది?

సుప్రీంకోర్టు భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీ లో ఉంది.

సుప్రీంకోర్టులో ఎన్ని న్యాయమూర్తులు ఉంటారు?

సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India),గరిష్టంగా 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : 

https://vaartha.com/dost-special-phase-college-admission-deadline-extended-balakishtareddy/telangana/528127/

Breaking News discom payments electricity dues electricity supply India News latest news legal ruling NABL power distribution companies state government arrears Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.