📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Supreme court: స్పీకర్‌పై కేటీఆర్ ధిక్కార పిటిషన్

Author Icon By Pooja
Updated: November 10, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ శాసనసభ స్పీకర్ జి. శివ ప్రసాద్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టులో(Supreme court) ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 3న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలపై మూడు నెలల వ్యవధిలో చర్యలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read also: Revanth Reddy: కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం

Supreme court

సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోరిన కేటీఆర్
స్పీకర్ కోర్టు (Supreme court)ఆదేశాలను ధిక్కరించారని ఆరోపిస్తూ, ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ధర్మాసనంలో ప్రస్తావించారు. సీజేఐ గవాయ్ ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం విచారణ జరుపుతామని తెలిపారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నందున, ఈ కేసు అప్పటివరకు సాగవచ్చని న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ, “నవంబర్ 24 తర్వాత కూడా సుప్రీంకోర్టు ఉంటుంది కదా” అంటూ వ్యాఖ్యానించారు.

జూలై తీర్పు తర్వాత కూడా చర్యలు లేవు
గతంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ తదితరులు కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలలలో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ గడువు ముగిసినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు మరోసారి న్యాయపోరాటం ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BRS MLAs KTR petition Latest News in Telugu Telangana politics Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.