Sunitha murder case : వనస్థలిపురంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఆవేశంలో జరిగిన ఘటన కాదని, మాజీ భర్త మహేశ్ రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో అమలు చేసిన దారుణ హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సునీతపై ఉన్న పగతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.
పోలీసుల ప్రకారం, కెనడాలో ఉద్యోగం కోల్పోవడం మరియు సునీత పెట్టిన కేసుల కారణంగా తిరిగి అక్కడికి వెళ్లలేకపోవడంతో మహేశ్ ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. సునీత ఆచూకీ తెలుసుకోవడానికి ఆమె సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కనిపించిన పరిసరాల ఆధారంగా వనస్థలిపురంలోని కాప్రాయి చెరువు సమీపంలో ఆమె నివాసాన్ని గుర్తించాడు.
Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?
హత్యకు ముందే మహేశ్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు. తలుపులు తెరవకపోతే కోసేందుకు కట్టర్ మెషిన్, ప్రతిఘటనను అడ్డుకోవడానికి పెప్పర్ స్ప్రే, దాడి కోసం పదునైన కత్తులు వెంట తీసుకువచ్చాడు. హత్య అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సుమారు 60 రోజుల పాటు తుర్కయాంజిల్ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సునీత కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. సరైన సమయం చూసి, వాచ్‌మన్ లేని సమయంలో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
సునీత రెండో భర్త శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మహేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యలో ఉపయోగించిన ఆయుధాలు మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: