📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Summer: అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన కార్యక్రమాలు

Author Icon By Anusha
Updated: February 13, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రానున్న వేసవి (Summer) కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అగ్ని ప్రమాదాల పట్ల నగర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, ముఖ్యంగా వేసవిలో నిప్పుతో ఊహించని ప్రమాదం పొంచి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రతిఒక్కరూ అగ్నిమాపక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఓ అవగాహనా కార్యక్రమంలో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, “కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

Read Also: Makthal Municipal Election Results: మక్తల్‌ను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్!

ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా తీసుకోవాల్సిన అంశం

అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే పరిస్థితి మన చేతుల్లో ఉండదు. నగరంలో గతంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాలను విశ్లేషిస్తే, ఎక్కువగా నిబంధనల ఉల్లంఘనలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి” అని స్పష్టం చేశారు. అగ్నిమాపక భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా తీసుకోవాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో హైడ్రా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని కమిషనర్ వివరించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిబంధనలను , తప్పకుండా పాటిస్తేనే ప్రమాదాలను నివారించగలమని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టవచ్చని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

Summer: Hydra awareness programs on fire hazards

త‌ర‌చూ జ‌రుగుతున్న అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి నెలాఖ‌రులో త‌నిఖీలు చేప‌ట్టి 9 షాపుల‌ను సీజ్ చేసిన‌ట్టు గుర్తు చేశారు. ప‌లు వ్యాపార సంఘాల విన‌తుల మేర‌కు ఒక నెల రోజులు స‌మ‌యం ఇచ్చామ‌ని.. మార్చి నెల రెండో వారం నుంచి త‌నిఖీలు ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఆయా వ్యాపార స‌ముదాయాల‌ను, షాపుల‌ను సీజ్ చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ హెచ్చ‌రించారు. అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో హైడ్రా త‌నిఖీలు చేయ‌డం, నిబంధ‌న‌లు పాటించ‌ని వ్యాపార సుముదాయాల‌ను సీజ్ చేయడాన్ని వేధించ‌డంగా భావించ‌వ‌ద్ద‌ని చెప్పారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని వ్యాపార‌ సంఘాల ప్ర‌తినిధులతో పాటు.. పౌరుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు హైడ్రా పెద్ద పీట వేస్తుంద‌న్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AV Ranganath HYDRAA fire safety awareness latest news summer fire accidents Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.