📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Suicide: అల్లుడి అనారోగ్యాన్ని తట్టుకోలేక తల్లి, కూతురు ఆత్మహత్య

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిద్దిపేట (Siddipet) జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. కుటుంబానికి మగ దిక్కుగా నిలుస్తున్న అల్లుడు అనారోగ్యం పాలవ్వడంతో, తల్లీ కుమార్తెలు (Mother and Daughter) తీవ్ర ఆవేదనకు గురై పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఘటన వివరాలు:

గౌరారం ఎస్సై కరుణాకర్ ​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గౌరారం గ్రామానికి చెందిన వెల్దుర్తి భారతమ్మ (65)కు దివ్యాంగురాలైన కవిత (32) కుమార్తె ఉంది. భారతమ్మ భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

అల్లుడి అనారోగ్యం… కుటుంబం ఆవేదనలో

కుమార్తెకు వివాహం చేయగా, అల్లుడు మంజునాథ్​ వీరి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయన కూలీ పనులు చేస్తూ ఆసరాగా ఉంటున్నాడు. ఈ దంపతులకు 13 ఏళ్లలోపు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నెల రోజులుగా మంజునాథ్​ పచ్చ కామెర్లతో బాధపడుతూ హైదరాబాద్​లో చికిత్స పొందుతున్నారు. చికిత్స అందిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేదు. కుటుంబంలో తల్లీ కుమార్తెలిద్దరికీ మగ దిక్కు లేక తీవ్ర ఆవేదనకు (Deeply distressed) గురయ్యేవారు.

తల్లి కుమార్తె ఆత్మహత్య

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పిల్లలిద్దరూ పడుకున్నాక తల్లి, కుమార్తె ఇంట్లో పురుగు మందు తాగి పడుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఎంతసేపైనా అమ్మమ్మ, అమ్మ లేవకపోవడంతో పిల్లలు పొరుగు వారికి చెప్పారు. వారు పరిశీలించగా తల్లీకుమార్తెలు విగతజీవులై కనిపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంజునాథ్ హైదరాబాద్​ నుంచి​ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి, అంత్యక్రియలు నిర్వహించారు.

పిల్లల భవిష్యత్తుపై ఆందోళన… మంజునాథ్ కన్నీటి వేదన

అనారోగ్యంతో బాధపడుతున్న మంజునాథ్, ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థుల సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేసినా, ఇప్పుడు తన పిల్లల భవిష్యత్ ఏమిటని మంజునాథ్ వాపోతున్నాడు.

ఇంకో విషాదకథ: మేనల్లుళ్ల ఆచూకీ కోసం ఎదురు చూసిన మేనత్త గుండె ఆగింది

మనోవేదనతో మేనత్త మృతి

ఇటీవల సిగాచీ దుర్ఘటనలోనూ ఇలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. తన ఇద్దరు మేనల్లుళ్ల ఆచూకీ కోసం ఎదురు చూస్తూ, వారి మేనత్త గుండె ఆగిపోయింది. పాశమైలారం పేలుడు ప్రమాదంలో ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. వారిలో ఉత్తరప్రదేశ్​కు చెందిన అన్నదమ్ములు అఖిలేశ్​​ నిషాంత్​(38), విజయ్ ​కుమార్​ నిషాంత్ (30) సిగాచీ పరిశ్రమలో పని చేస్తున్నారు. వారిద్దరి ఆచూకీ లభిస్తుందని స్వగ్రామంలో ఉన్న కుటుంబసభ్యులు నిరీక్షించారు. ఈ ప్రమాదం సమయంలో వారు బయటకు వచ్చి, ఉంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని ఎదురు చూశారు.

ప్రభుత్వ స్పందన – తక్షణ సాయం

పేలుడు ఘటనపై స్పందించిన అధికారులు ఇప్పటి వరకు ఆచూకీ లభించని కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.15 లక్షల చెక్కులు అందజేశారు. అయితే వారి శరీరాలు లభించకపోవడం కుటుంబాలను మానసికంగా కుంగదీస్తోంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Seethakka: రాష్ట్రంలో మరో 18 దత్తత కేంద్రాలు- మంత్రి సీతక్క

Breaking News EmotionalTragedy latest news siddipet SiddipetNews Suicide Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.