సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ
Suicide Attempt: భువనగిరి: యేళ్ల తరబండ నుంచి తన భూ సమస్యలను పరిష్కరించడం లేదంటూ ఓ రైతు ఏకంగా ప్రజావాణి కార్యక్రమంలో తన గోడును వెల్లబోసుకుంటూ ఏకంగా ఒంటిపై పెట్రోల్ పోసుకున్న సంఘటన (Suicide Attempt) యాదాద్రి భువనగిరి జిల్లాలో కల కల సృష్టించింది. వివరాల్లోకి వెళితే యాప్రాల్ గ్రామానికి చెందిన రైతు తడకలపల్లి ఆజిరెడ్డి (Tadakalapalli Aji Reddy) యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 345లో మూడు గుంటలు, సర్వేనెంబర్ 346లో ఎకరం 32 గుంటల భూమిని చీమల లింగం అనే వ్యక్తి నుంచి ఖరీదు చేసుకొని మే 9,2005న డాక్యుమెంట్ నెంబర్ 2226/2005 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని బొమ్మలరామ్నార తాసిల్దార్ కార్యాలయంలో అమెండ్మెంట్ నెంబర్ 47/200708 ద్వారా పట్టా మార్పిడి చేసుకున్నారు .అందుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను సైతం పొందారు. తాను 2011వరకు పహాని రికార్డుల్లో సైతం నా పేర రెవెన్యూ అధికారులు నా యొక్క భూముల వివరాలను పొందుపరిచారు. అప్పటినుంచి ఆన్ లైన్ రికార్డుల్లో (online records) నా పేరు రావడం లేదంటూ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని, ఇదే విషయంపై జిల్లా అధికారుల ఫిర్యాదు చేసుసుకున్న నా సమస్య పరిష్కారం నోచుకోవడం లేదంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత తీసి సోమవారం కలెక్టరేట్ మందిరములో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల సమక్షంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేస్తుండడంతో అప్రమత్తమైన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్య జటిలంగా ఎందుకు మారిందో పూర్తి నివేదిక రూపకంగా తక్షణమే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు బొమ్మలరామ్నార తాసిల్దార్ ను ఆదేశించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతు ఆగి రెడ్డి ప్రజావాణి కార్యక్రమం నుంచి తిరిగి వెళ్లిపోయారు.
తడకలపల్లి ఆజిరెడ్డి ఎందుకు పెట్రోల్ పోసుకున్నాడు?
తన భూమి రికార్డులు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఆజిరెడ్డి, సమస్య పరిష్కారమవడం లేదంటూ నిరసనగా పెట్రోల్ పోసుకున్నాడు.
కలెక్టర్ ఈ సంఘటనపై ఏమి చేశారు?
సమస్యపై తక్షణ నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించిన కలెక్టర్ హనుమంతరావు, సమస్యను పరిష్కరించనున్నట్లు ఆజిరెడ్డికి హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Anil Kumar: నెలాఖరుకు ఘోష్ నివేదిక! ఇక మాజీ ఇఎన్ సి అనిల్ కుమార్ విచారణ