తెలంగాణ(Telangana)లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, రవాణా శాఖ కీలక చర్యలు చేపట్టింది. ప్రమాదాలను తగ్గించడానికి ఇప్పటికే అమల్లో ఉన్న రూల్స్‌ను కఠినంగా అమలు చేయడంతో పాటు కొత్త నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
ఇకపై ఓవర్‌లోడ్‌తో వాహనం పట్టుబడితే మొదటి సారి భారీ జరిమానా విధించనున్నారు. అదే వాహనం రెండోసారి కూడా నిబంధనలు(Terms) ఉల్లంఘిస్తే, వెంటనే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు, ప్రాణనష్టం పెరగడం ఈ నిర్ణయాలకు ప్రధాన కారణమైంది.
Read Also: AP: ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి: సిఎం చంద్రబాబు
హైదరాబాద్‌తో సహా మొత్తం 33 జిల్లాల్లో
హైదరాబాద్‌తో సహా మొత్తం 33 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను, అదనంగా మూడు రాష్ట్రస్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి రవాణా శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు తనిఖీ బృందాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉదయం 6 గంటలకు ఆదేశాలు పంపి 10 రోజులు వరుసగా తనిఖీలు జరిపారు. ఈ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 4,748 కేసులు నమోదు కాగా, మొత్తం 3,420 వాహనాలు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఓవర్‌లోడ్ వాహనాల కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటూ, వీటిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక్కసారి కాక రెండోసారి పట్టుబడితే పర్మిట్ రద్దు, లైసెన్స్ రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: