హైదరాబాద్ (State Rules & Regulations) : విద్యుత్ పంపిణీ సంస్థలకు (Discs) ఆర్థిక జవసత్వాలు కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్ధిక ఆరోగ్యాన్ని కల్పించేందుకు నియమాలను తెరముందుకు తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికావర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం పంపిణీ సంస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గాను డిస్కమ్లకు అకౌంటింగ్, రిపోర్టింగ్, బిల్లింగ్, సబ్సిడీ చెల్లింపు ప్రక్రియను క్రమబద్దీకరించనుంది, విద్యుత్ పంపిణీ చేయడంలో పంపిణీ సంస్థలు చేసిన పూర్తి వ్యయాలను రికవరీ చేయడానికి, విద్యుత్ సేకరణకు సంబంధించిన అన్ని ఖర్చులు పారదర్శకత్వ విధానంలో టారిఫ్ ను తీసుకోవడం జరుగేలా చర్యలు తీసుకుంటోంది. ఆమోదించేటప్పుడు పరిగణనలోకి వివిధ వర్గాలు వినియోగించిన విద్యుత్ ఖాతాల ఆధారంగా సబ్సిడీ కోసం డిమాండ్లను సేకరించే విధానానికి తెరలేపింది. ముఖ్యంగా త్రైమాసికం చివరి తేదీ నుండి 30 రోజుల్లోగా విద్యుత్ పంపిణీ సంస్థలు సంబంధిత నివేదికను సమర్పించాలని, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ల (ఎస్ఈఆరి) నివేదికను పరిశీలించి, త్రైమాసిక నివేదికను 30 రోజుల్లో సమర్పించాలని సూచించింది.
కేటగిరీల వారీగా వినియోగించే ఇంధన ఖాతాల ఆధారంగా సబ్సిడీ కోసం డిమాండ్ల సేకరణ, మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యుత్ డిస్కంల పటిష్టం వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్ లేకుండా చూడాల్సి ఉంటుంది. విద్యుత్ రంగం స్థిరత్వం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ అవసరం అయిన నేపథ్యంలో అనుచిత, పారదర్శకత లేని అకౌంటింగ్, అలాగే రాష్ట్రాలు వివిధ వర్గాలకు విద్యుత్ నిమిత్తం ఇస్తున్న సబ్సిడీల మొత్తాన్ని చెల్లించని లేదా ఆలస్యం చేయడం విద్యుత్ పంపిణీల ఆర్థిక ఇబ్బందులకు ఒక కారణంగా విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ఈక్విటీ పై సహేతుకమైన రాబడి (ఆర్ఈ) ఈ రంగంలో పెట్టుబడులు నిర్ధారించడానికి అవసరమైన ప్రధాన కారకాల్లో ఒకటిగా రాష్ట్రాలకు నొక్కి చెప్పింది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిన్ (CERC) పేర్కొన్న టారిఫ్ నిబంధలనలో ఒకటిగా సంబంధిత కాలానికి రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ కమిషన్ విధిగా అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం సబ్సిడీ, అకౌంటింగ్, సబ్సిడీ. బిల్లుల పెంపు చట్టం లేదా నియమ నిబంధన ప్రకారం ఉల్లంఘనలకు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు పాల్పడినట్లయితే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. అంతేకాకుండా సాంతికే, వాణిజ్య (ఎటి అంట్ సి) నష్టాన్ని తగ్గించడానికి కచ్చితమైన, సహేతుకమైన లక్ష్యాన్ని నిర్వచించడానికి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన టారిఫ్ ప్రకారం ఎటి అండ్సి నష్టాలను తగ్గించేలా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషను ఆమోదించాల్సి ఉంటుంది.
READ MORE :