📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Stamp Amendment Bill 2025: మహిళలకు మరో తీపికబురు

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ సవరణ బిల్లు 2025 (Stamp Amendment Bill 2025)ను తీసుకురానుంది. దీని ద్వారా భూముల ధరలు సవరించబడతాయి. మహిళలకు స్టాంప్ డ్యూటీలో ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి విలువలో 6 స్టాంప్ వ్యాటీగా విధించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 5 (Registration charges 5rs), బదిలీ సుంకం 1.5 గా ఉండనున్నాయి. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, రియల్ ఎస్టేట్ పారదర్శకతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు-2025

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని జామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 (Stamp Amendment Bill 2025)ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లులో భాగంగా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని (Land prices should be revised.) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. ఈ నిర్ణయాల మధ్య, మహిళలకు ప్రత్యేకంగా స్టాంప్ డ్యూటీలో తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం ఒక సంచలనాత్మక తీర్మానం చేసింది. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్ధిక భద్రతకు దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 అమల్లోకి వస్తే స్టాంపు డ్యూటీ ఆస్తి విలువలో 6 శాతంగా విధించే అవకాశం ఉంది. ఈ మొత్తంలో చేర్చబడతాయి.

ఆస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జ్

ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జ్ లు వసూలు చేయ నున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆస్తి ఇతరుల పేరిట బదిలీ చేసినప్పుడు, ఆస్తి విలువలో 1.5 శాతం బదిలీ నుంకం చెల్లించేలా చట్టంలో పొందుపరచ నున్నారు. ఈ మార్పులు రియల్ ఎస్టేట్ రంగానికి, సాధారణ ప్రజలకు స్పష్టతను, స్థిరత్వాన్ని ఇస్తాయని అంచనా. ఈ నూతన విధానం ద్వారా మహిళలకు స్టాంప్ డ్యూటీలో ప్రత్యేక రాయితీ లభించడం ఒక విప్లవాత్మక చర్యగా భావించవచ్చు. ఇది మహిళలు ఆస్తులను తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా వారికి ఆర్థిక భద్రతను, ల్యాండ్ రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీ తగ్గింపు కొత్త చట్టసవరణ తర్వాతే అంటున్న అధికారులు రిజిస్ట్రేషన్, బదలీ ఛార్జీలు కూడా సామాజిక గుర్తింపును అందిస్తుంది. కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను పెంచడంతో పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్షాయానికి ఇది అద్దం పడుతుంది. ఈ బిల్లు ద్వారా భూముల విలువలు వాస్తవ మార్కెట్కు దగ్గరగా వస్తాయి. ఇది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పారదర్శకతను పెంచు తుంది. అలాగే.. ప్రభుత్వానికి కూడా గణనీయమైన రెవెన్యూ సమకూరుతుంది. ఈ సంస్కరణలు తెలంగాణలో మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుస్తాయి. అయితే ఇది చట్ట సవరణ తర్వాతే కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇది దీర్ఘకాలికంగా సానుకూల ప్రభావాలను చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Bonalu 2025: అంగరంగవైభవంగా లాల్ దర్వాజ మహంకాళి బోనాలు వేడుకలు

Breaking News Financial Benefits for Women latest news Property Registration for Women Stamp Amendment Bill 2025 Stamp Duty Concession Telugu News Telugu newsBreaking news Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.