నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక కుటుంబం ప్రాణాలతో బయటపడిన భయానక సంఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం దైవ(Srisailam Trip) దర్శనానికి బయలుదేరిన ఈ కుటుంబం ప్రయాణమధ్యలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్ కుమార్ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి బయలుదేరాడు. కారు ఈగలపెంట సమీపానికి చేరుకున్నప్పుడు, ఒక్కసారిగా వాహనం ముందు భాగం నుంచి పొగ రావడం గమనించాడు. పరిస్థితి అర్థం చేసుకున్న ప్రణవ్ వెంటనే కారు రోడ్డుపక్కన ఆపి, కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు దించాడు.
Read also: Fake Call: అమెరికాలో ఉన్న కొడుకు పేరుతో ఫేక్ కాల్: షాక్‌తో తండ్రికి ప్రాణాపాయం
క్షణాల్లో కారు మంటల్లో
ప్రయాణికులు కారు నుంచి దూరంగా వెళ్ళగానే, పొగలు కాస్త మంటలుగా మారాయి. క్షణాల్లోనే ఆ మంటలు(Srisailam Trip) వాహనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే పెద్ద విషాదం తప్పేది కాదు. అప్రమత్తమైన ప్రణవ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సమీప జెన్‌కో యూనిట్‌కు చెందిన ఫైర్ ఇంజిన్(Fire engine) సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయింది.
ట్రాఫిక్ అంతరాయం, విచారణ కొనసాగుతుంది
ప్రమాదం జరిగిన ప్రాంతం హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉండటంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. కారులో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: