📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telugu News: Srisailam: శ్రీశైలం’ నాలుగో యూనిట్‌ డామేజ్ తో వెయ్యి కోట్ల నష్టం

Author Icon By Sushmitha
Updated: October 27, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీశైలం: శ్రీశైలం(Srisailam) జల విద్యుత్కేంద్రంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. 150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో యూనిట్, మరమ్మతుల తర్వాత విద్యుదుత్పత్తి(Electricity generation) ప్రారంభించిన కేవలం 10 గంటల్లోనే మళ్లీ పాడై (ట్రిప్‌ అయి) పూర్తిగా నిలిచిపోయింది. ఈ యూనిట్ ఇలా పూర్తిగా పాడవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ కేంద్రంలో ఆరు విద్యుత్ యూనిట్లు ఉండగా, ఒక్కోదాని సామర్థ్యం 150 మెగావాట్లు.

Read Also: Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ

ఐదేళ్లలో రూ.1000 కోట్ల నష్టం, నిర్లక్ష్యం

2020 ఆగస్టు 20న సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా నాలుగో యూనిట్ పూర్తిగా కాలిపోయింది. అప్పటి నుంచి ఈ యూనిట్ సక్రమంగా పనిచేయకపోవడంతో, ఐదేళ్ల కాలంలో రోజుకు 30 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)కు సుమారు రూ.వెయ్యి కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీశైలంలో యూనిట్ విద్యుత్ కేవలం రూ.2కే ఉత్పత్తవుతుండగా, డిమాండ్ పెరిగిన సమయంలో డిస్కంలు మార్కెట్‌లో అధిక ధరలకు కరెంటు కొనాల్సి వస్తోంది. ఈ యూనిట్ మరమ్మతు విషయంలో జెన్‌కో తీవ్ర నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు ఉన్నాయి.

మరమ్మతు పనులు, భవిష్యత్ సవాళ్లు

2021 సెప్టెంబర్‌లో రూ.68 కోట్లతో మరమ్మతు చేపట్టిన తర్వాత, 2023 ఆగస్టు 15న తిరిగి ఉత్పత్తి ప్రారంభించినా.. 80 గంటలు మాత్రమే పనిచేసి మళ్లీ పాడైంది. రెండేళ్ల తర్వాత ఈ నెల 2న పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించిన 10 గంటల్లోనే మరోసారి ట్రిప్‌ కావడంపై జెన్‌కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరమ్మతులు చేసిన ప్రైవేటు సంస్థపై బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సదరు సంస్థ ఈ నెల 29న నిపుణులతో అధ్యయనం చేయించి చెబుతామని తెలిపింది. దీంతో ఈ యూనిట్‌లో వచ్చే ఏడాది వానాకాలంలో వచ్చే వరదలకు విద్యుదుత్పత్తి చేయడం కష్టమేనని, రోజుకు రూ.60 లక్షల నష్టం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలోని ఏ యూనిట్ మళ్లీ పాడైంది?

150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో యూనిట్‌ మళ్లీ పాడైంది.

నాలుగో యూనిట్ పాడవడం వల్ల జెన్‌కోకు ఎంత ఉత్పత్తి నష్టం వాటిల్లింది?

ఐదేళ్ల కాలంలో సుమారు రూ.వెయ్యి కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

electrical tripping Genco Google News in Telugu Latest News in Telugu power unit failure Srisailam fire accident. Srisailam Hydro Power Plant Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.