📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Sridhar Babu: ఇ-గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా సహకారం తీసుకుంటాం :మంత్రి శ్రీధర్ బాబు

Author Icon By Sharanya
Updated: July 26, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ఇ-గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు.

ప్రజా సేవలు తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్ అవసరం

ఎస్తోనియా (Estonia) రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రిని కలిసారు. ఈ సందర్భంగా ఎస్తోనియా వాణిజ్య ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్యరంగాల ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్ (E-Governance) కీలకమని ఆయన తెలిపారు. ఇందులో ఎస్తోనియా తోడ్పాటును కోరుతున్నాం. సైబర్ సెక్యూరిటీలో సైతం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

డ్రోన్ టెక్నాలజిలో తెలంగాణాలో గణనీయ అభివృద్ధి సాధించిందని, ఇటీవల పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్లో తయారైన డ్రోన్లు మా శత్రుదేశానికి భారీ నష్టం కలిగించాయన్నారు. భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నాం అన్నారు. ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. సెప్టెంబరులో తమ దేశం సందర్షించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్ బాబు స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు. సమావేశంలో ఐటి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పోరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు .

ఎస్తోనియా దేశం ఏమిటి? ఇది డిజిటల్ పాలనలో ఎందుకు ప్రాముఖ్యం పొందింది?

ఎస్తోనియా ఉత్తర యూరోపులోని ఒక చిన్న దేశం. ఇది ప్రపంచంలోని అత్యధిక డిజిటలైజ్డ్ ప్రభుత్వ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలలో ఒకటి. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ‘ఇ-ఎస్టోనియా’ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.

తెలంగాణ రాష్ట్రం ఎస్తోనియాతో కలిసి పనిచేయాలనుకుంటున్న రంగాలు ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థలు, డేటా సెక్యూరిటీ, పబ్లిక్ సర్వీసుల డిజిటలైజేషన్ వంటి రంగాల్లో ఎస్తోనియాతో సాంకేతిక సహకారం తీసుకోవాలనుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Governor Jishnu Deva Varma: నర్సులే సమాజానికి ప్రాణదాతలు– గవర్నర్ జిష్ణుదేవవర్మ

Breaking News Digital Transformation E-Governance Telangana Estonia Collaboration Estonia E-Governance latest news Sridhar Babu Telangana IT Minister Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.