📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Sports: క్రీడా పాఠశాలలు పతకాలు సాధించే కర్మాగారాలుగా మారాలి: వాకిటి శ్రీహరి

Author Icon By Vanipushpa
Updated: August 9, 2025 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు పతకాలు సాధించే కర్మగారాలుగా మారాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) అన్నారు. ఇక వ్యక్తిత్వ వికాసంలోనూ మూడు నెలలకొకసారి విద్యార్థుల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీస్టేడియం(LB stadium)లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి(Sports Authority Chairman Shivasenareddy) తో కలిసి ఆయన స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీలలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సమావే శాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల పనితీరు, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

క్రీడా పాఠశాలలు పతకాలు సాధించేకర్మాగారాలుగా మారాలి: వాకిటి శ్రీహరి

2025-26 విద్యాసంవత్సరానికి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరగాలని, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో ఆధునిక క్రీడా శిక్షణ, విద్యలో మెరుగుదల సాధిం చాలని శ్రీహరి పేర్కొన్నారు. అదేవిధంగా హకీంపేట్లో తక్షణ మరమ్మ తులు, అన్ని స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ అథారిటీ అకాడమీల పనితీరు మెరుగు పరిచి క్రీడాకారుల్లో స్ఫూర్తిని కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. స్పోర్ట్స్ స్కూల్, అకాడమీల్లో త్రైమాసికంగా బ్యాటరీ టెస్టులు నిర్వహించి, కంప్యూటరైజ్డ్ రిపోర్టులు విద్యార్థుల తల్లిదండ్రు లకు పంపించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించే వారిని ఉపేక్షి ంచమని మంత్రి శ్రీహరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్తోపాటు హకింపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి టి. మమత, డిప్యూటీ డైరెక్టర్లు జి చంద్రరెడ్డి జి. రవీందర్, డా. రవిశంకర్ పల్లెల, ఎస్.ఎం. బాషా, జి. అశోకక్కుమార్, పి.సందీప్కుమార్, సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలు అంటే?

శారీరక శ్రమతో కూడిన పోటీ లేదా ఆటలు. ఇవి వ్యక్తిగతంగా లేదా సమూహాలుగా ఆడవచ్చు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యానికి, వినోదానికి ఉపయోగపడతాయి. 

క్రీడలు ఎందుకు ముఖ్యమైనవి?

స్పోర్ట్స్ ఆడటం ద్వారా ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది మరియు ఆరోగ్యంగా మారుతుంది ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. క్రీడలు వృద్ధాప్యంలో కూడా ఎముకల బలాన్ని మెరుగుపరుస్తాయి. శరీర పోషణకు ఆరోగ్యకరమైన పోషకాల ఆహారం ఎంత అవసరమో, మన జీవితాలను, ముఖ్యంగా ఎదిగే పిల్లలకు క్రీడలు ఆడటం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/film-chamber-orders-to-halt-shootings/telangana/527912/

athletes India-sports-development Latest News Breaking News medals Sports sports-schools Telugu News training Vakiti Srihari

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.