📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Smitha Sabarwal : సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న శ్రీధర్ బాబు

Author Icon By Divya Vani M
Updated: April 16, 2025 • 10:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కంచ గచ్చిబౌలి భూముల వివాదం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది తాజాగా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. ఆమె షేర్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోటోపై పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భూముల విషయమై చట్టప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఆయా భూములు ప్రభుత్వానికి చెందినవేనని కోర్టు కూడా ధృవీకరించిందని తెలిపారు దీనితో ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు. నకిలీ ఫొటోలు, వీడియోల వల్ల ప్రజలు తప్పుదారి పట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంకా విచారణలో ఉన్న విషయాలపై మాట్లాడటం సరికాదని అన్నారు.

Smitha Sabarwal సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న శ్రీధర్ బాబు

ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.అంతేకాదు తెలంగాణ బీజేపీ నేతలు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. వారి ప్రోపగండా వల్లే ప్రధాని మోదీ కూడా గచ్చిబౌలి భూముల గురించి తప్పుగా మాట్లాడినట్లుగా విమర్శించారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమన్నారు. మరోవైపు, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నట్లు తనకు అనుమానం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేళ్లా గద్దలుగా నెగిటివ్ ప్రచారం చేసి, విశ్వాసాన్ని దెబ్బతీసే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం శక్తివంతంగా ఉంది, ఇలాంటివాళ్లతో ఊగిపోతుందని భావించవద్దని చెప్పారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సహజమైన ప్రక్రియ అని ఒక ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. దీనిని రకరకాలుగా వక్రీకరించడం సరైంది కాదన్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి. కానీ మంత్రుల స్టేట్‌మెంట్లు, అధికారుల స్పందనలు చూస్తే… రాజకీయంగా ఇది పెద్ద హంగామా సృష్టించేదిగా కనపడుతోంది.

AIDeepfakeControversy CongressGovernment KanchGachibowliLands LandDisputeTelangana SmitaSabharwal SridharBabu SupremeCourtOrders TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.