📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Market Yard: కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులు గ్రీన్ సిగ్నల్

Author Icon By Vanipushpa
Updated: August 9, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్వరలో తుది ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లోని రైతులు పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మరింత వెసులుబాటు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్కెటింగ్(Marketing) వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వ్యవసాయ మార్కెట్ యార్డులు(Market Yards) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించి త్వరలో తుది ఉత్తర్వులను జారీ చేయనుంది. ఈ కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులను రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాలోని కోడేరు, పెద్దకొత్తపల్లి. వనపర్తి జిల్లాలోని పానగల్, వీవనగండ్ల, ఖిలాఘన్పూర్, గోపాల్పేట.

Market Yard: కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులు గ్రీన్ సిగ్నల్

పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు, హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి. నల్గొండ జిల్లాలోని దామరచర్ల. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మత్కేపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 197 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త వ్యవసాయ మార్కెట్లు యార్డులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాటి సంఖ్య 207కి చేరనుంది. ఈ కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో స్థలాలను సైతం గుర్తించినట్లు వ్యవసాయ శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. వీటి ఏర్పాటుకు గాను ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కానందున ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు మరో ఐదు మార్కెట్ యార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటే ఏమిటి?
వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (APMC) యార్డ్ / నియంత్రిత మార్కెట్ కమిటీలు (RMC) యార్డ్ అనేది మార్కెట్ కమిటీ నిర్వహించే మార్కెట్ ప్రాంతంలోని ఏదైనా ప్రదేశం, ఇది నోటిఫైడ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశువులను భౌతికంగా, ఎలక్ట్రానిక్ లేదా ఇతర రీతిలో మార్కెటింగ్ నియంత్రించడానికి ఉద్దేశించబడింది.
మార్కెట్ల ప్రాముఖ్యత 3 పాయింట్లు ఏమిటి?
మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ప్రభుత్వాలు, వ్యాపారాలు మరియు వ్యక్తులు తమ వస్తువులు మరియు సేవలను కొనుగోలు మరియు అమ్మకం చేయగల స్థలాన్ని అవి అనుమతిస్తాయి. కానీ అంతే కాదు. అవి వస్తువులు మరియు సేవల ధరలను నిర్ణయించడంలో మరియు ఆర్థిక వ్యవస్థలోకి చాలా అవసరమైన ద్రవ్యతను ప్రవేశపెట్టడంలో సహాయపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/agriculture-sector-the-use-of-biotechnology-in-the-agricultural-sector-should-increase/telangana/528079/

agri-development agriculture Farmers government-approval india Latest News Breaking News market-yards Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.